Unstoppable With NBK Season 2: బాలయ్య బాబు పైకి కఠువుగానే కనిపిస్తారు కానీ ఆయన మనసు వెన్న లాంటిది అని అందరూ అంటూ ఉంటారు..లేటెస్ట్ గా ఆయన వ్యాఖ్యాతగా వ్యవరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రోగ్రాం ద్వారా అది ఎంత నిజమో అర్థం అవుతుంది..ఎప్పుడు ఫైట్స్ మరియు డైలాగ్స్ చెప్పే బాలయ్య బాబు లో ఇలాంటి కోణం కూడా ఒకటి ఉందా అని అందరిని ఆశ్చర్యపొయ్యేలా చేసాడు..మొదటి సీసన్ లో ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచిన బాలయ్య బాబు..తన జీవితం లో చోటు చేసుకున్న కొన్ని మధుర జ్ఞాపకాలను మరియు అనుభవం ని అక్కడకి వచ్చిన సెలబ్రిటీస్ తో షేర్ చేసుకొని ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

ఇప్పుడు లేటెస్ట్ గా ఈ టాక్ షో కి రెండవ సీసన్ ప్రారంభమైన సంగతి మన అందరికి తెలిసిందే..మొదటి ఎపిసోడ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో చెయ్యడగా..రెండవ ఎపిసోడ్ కి యువహీరోలైన సిద్దు జొన్నలగడ్డ మరియు విశ్వక్ సేన్ లతో పాటు టాలీవుడ్ యంగ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా హాజరయ్యారు.
ఈ ఎపిసోడ్ ఈరోజు ఆహా లో ప్రసారమైంది..యువ హీరోలిద్దరితో బాలయ్య బాబు సరదాగా చిట్ చాట్ చేస్తూ ఆడిపాడారు..అయితే హీరో సిద్దు జొన్నలగడ్డ సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో ఎదురుకున్న కొన్ని అవమానాలను బాలయ్య బాబు కి చెప్తూ బాగా ఎమోషనల్ అయ్యాడు..కెరీర్ ప్రారంభం లో చిన్న అవకాశం కోసం ఎన్నో పాట్లు పడ్డానని..హీరో అవుదాం అనే కలతో ఇండస్ట్రీ కి వచ్చిన తనని ఒక ప్రముఖ డైరెక్టర్ చాలా ఘోరంగా అవమానించాడని..నీ మొహానికి క్యారక్టర్ ఆర్టిస్టు రోల్ ఇవ్వడమే ఎక్కువ..హీరో అవకాశం కూడా కావాలా నీకు అంటూ చాలా అవహేళన చేసాడని సిద్దు జొన్నలగడ్డ చెప్తూ చాలా ఎమోషనల్ అయ్యాడు.

సిద్దు అంత ఎమోషనల్ గా మాట్లాడడం చూసి బాలయ్య బాబు కూడా కంటతడి పెట్టాడు..ఆ తర్వాత అతనిని గట్టిగ హత్తుకొని, ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్న స్టేటస్ కి అతగాడి నీ దగ్గరకి కాల్ షీట్స్ కోసం తిరగాలి..ఇది కదా అసలైన సక్సెస్ అంటే అని మెచ్చుకున్నాడు బాలయ్య.
https://www.youtube.com/watch?v=3qjwMloID_0