https://oktelugu.com/

Akhanda Movie: వాళ్ళు నన్ను అలా పిలవడం నచ్చలేదంటూ ఫైర్ అయిన బాలకృష్ణ…

Akhanda Movie: నంద‌మూరి నటసింహం బాల‌కృష్ణ, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో వచ్చిన తాజా చిత్రం “అఖండ‌”. డిసెంబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి సొ నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా … ప్రముఖ హీరో శ్రీకాంత్ విలన్ పాత్రలో చెలరేగాడు. ఈ చిత్రానికి మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. సింహా, లెజెండ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 3, 2021 / 03:21 PM IST
    Follow us on

    Akhanda Movie: నంద‌మూరి నటసింహం బాల‌కృష్ణ, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో వచ్చిన తాజా చిత్రం “అఖండ‌”. డిసెంబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి సొ నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా … ప్రముఖ హీరో శ్రీకాంత్ విలన్ పాత్రలో చెలరేగాడు. ఈ చిత్రానికి మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. సింహా, లెజెండ్ తర్వాత బాలయ్య – బోయపాటి కాంబోలో వచ్చిన ఈ మూవీపై ముందు నుంచే ప్రేక్షకులు, సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరోసారి ఘన విజయం సాధించి వీరిద్దరూ హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్నారు. తమన్ మ్యూజిక్ తో మరోసారి మ్యాజిక్ చేశాడని చెప్పాలి.

    Also Read: Akhanda Movie: వాళ్ళు నన్ను అలా పిలవడం నచ్చలేదంటూ ఫైర్ అయిన బాలకృష్ణ…

    కాగా ఈ సినిమా బృందం హైదరాబాద్ నగరంలోని ఏఎంబి మల్టీప్లెక్స్ లో సినిమాను వీక్షించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలయ్య . అందులో హీరో బాలకృష్ణతో పాటు, దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు తమన్, అలాగే సినిమాకి పని చేసిన బృందం అంతా పాల్గొన్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ… సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. అలాగే తాను సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి బాలకృష్ణ మాట్లాడారు. ఇంటర్వెల్ లో బయటికి వచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లలు వచ్చి సినిమా బాగుంది అంకుల్ అన్నారు. అంతా బాగానే ఉంది కానీ వారు నన్ను అంకుల్‌ అనడం నాకు నచ్చలేదు అని సరదాగా చెప్పారు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం మా విజయం మాత్రమే కాదు చలన చిత్ర పరిశ్రమ విజయం. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. పనిలో దేవుడున్నాడు. అందుకే పనినే మేం నమ్ముతాం’ అని తెలిపారు బాలకృష్ణ.

    Also Read: Tollywood Stars: రిస్కీ లైఫ్స్… సర్జరీలతో సావాసం చేస్తున్న స్టార్స్