Balakrishna role passed: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు వీళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇక కొంతమంది హీరోలు ఇక్కడ సక్సెస్ లను సాధించలేక వేణు తిరిగి వెళ్ళిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే నందమూరి ఫ్యామిలీలో బాలయ్య బాబు (Balayya Babu) కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన అదే క్రేజ్ ను మైంటైన్ చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి సినిమాలు చేస్తూ వచ్చిన కూడా బాలయ్య బాబు మాత్రం తన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు సీనియర్ హీరోలందరిలో తను కూడా ఒకడిగా నిలదుక్కుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… బాలయ్య బాబు చేసిన సినిమాలు అతనికి మంచి క్రేజ్ ను తీసుకురావడమే కాకుండా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయే సినిమాలు కావడం విశేషం… అయితే బాలయ్య బాబు చేసిన అన్ని సినిమాలు ఒకెత్తయితే ఒక సినిమాని వదులుకోవడం వల్ల వేరే ఒక హీరో ఆ సినిమాని చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడని బాలయ్య చాలా సందర్భాల్లో తెలియజేశాడు. ముఖ్యంగా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ (Krack) సినిమా బాలయ్య బాబు చేయాల్సింది.
Also Read: తన సినిమాల్లోని పాత బ్లాక్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేయబోతున్న చిరంజీవి..ఫ్యాన్స్ కి పండగే!