Balakrishna perfect roles: ‘నందమూరి నటసింహం బాలయ్య బాబు’ తన ఎంటైర్ సినిమా కెరియర్ లో ఎన్నో డిఫరెంట్ పాత్రలను పోషించాడు. ఆ పాత్రల్లో తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్న విధానం ప్రతి ఒక్కరికి నచ్చింది. ముఖ్యంగా మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో బాలయ్య బాబు సైతం ఒకరిగా నిలవడం నిజంగా చాలా గొప్ప విషయం… ఇక బాలయ్య ఎన్ని సినిమాలు చేసినా కూడా కొన్ని పాత్రల్లో ఆయన చాలా ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటాడు. ఆ పాత్రలను ప్రేక్షకులు ఎప్పుడు చూసిన కూడా ఆస్వాదిస్తూ ఉంటారు. నిజానికి బాలయ్య ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చాలా బాగా సెట్ అవుతాడు… అలాగే ఒక ఫ్యాక్షన్ లీడర్ గా కూడా ఆయన బాగా సెట్ అవుతాడు. ‘సమరసింహ రెడ్డి’, ‘నరసింహ నాయుడు’, ‘చెన్న కేశవ రెడ్డి’ సినిమాల్లో ఆయన ఫ్యాక్షనిస్ట్ గా మెప్పించాడు.
ముఖ్యంగా ‘రౌడీ ఇన్స్పెక్టర్’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా ఆయన నటించిన విధానం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఆ సినిమాలో బాలయ్య నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇక ఆ తర్వాత ‘లక్ష్మీ నరసింహ’ సినిమాలో సైతం పోలీస్ ఆఫీసర్ గా ఒక పవర్ ఫుల్ రోల్ చేశాడు.
Also Read: చిరంజీవి విశ్వంభర సమ్మర్ లో కూడా రానట్టేనా..?
ఈ రెండు సినిమాలే కాకుండా మరికొన్ని సినిమాల్లో కూడా బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఆయన పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ప్రతిసారి అందులో ఏదో ఒక వైవిధ్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తాడు. ఈ మధ్యకాలంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బాలయ్య బాబుకి ఒక సినిమా కూడా రాలేదు… ఒకవేళ వస్తే కనక అది భారీ విజయాన్ని సాధిస్తుంది.
ఇప్పుడున్న మేకర్స్ బాలయ్య బాబు తో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ తో సినిమా చేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ సినిమా విమర్శకులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా రాబోయే రోజుల్లో బాలయ్యను ఒక పవర్ ఫుల్ పాత్ర లో మనం చూడొచ్చా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు…
