సినిమా రచయితగా ఒక కథకు అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్రస్తుత టాప్ రైటర్ ‘విజయేంద్ర ప్రసాద్’. సహజంగా వయసు అయిపోగానే రచయితలు ట్రాక్ తప్పుతారు. 300 వందల సినిమాలను అలవోకగా రాసి పడేసి ఒకప్పుడు వరుస హిట్స్ ను ఇచ్చిన పరుచూరి బ్రదర్స్ లాంటి రైటర్లే వయసు అయిపోయాకా, చడీచప్పుడు లేకుండా ఫేడ్ అవుట్ అయిపోయారు. అయితే వారి వయసే ఉన్న ‘విజయేంద్ర ప్రసాద్’ మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూ ఇప్పటికీ స్టార్ హీరోలకు కథలు రాస్తూ స్టార్ రైటర్ గా కొనసాగుతున్నాడు.
Also Read: భయపడ్డ స్టార్ హీరో.. ఇక మహాభారతం రాదు !
విజయేంద్ర ప్రసాద్ విజన్ ఏమిటన్నది బాహుబలి, భజరంగీ భాయ్ జాన్ కథలు చూస్తేనే అర్థం అవుతుంది. బాలీవుడ్ లో సైతం ఆయన కథకు బ్రహ్మరథం పడుతున్నారు. కథా రచయితగా… ఆయన డిమాండ్ అంతలా ఉంది మరి. అయితే ‘విజయేంద్ర ప్రసాద్’ తాజాగా డైరెక్టర్ వినాయక్ – బాలయ్య కోసం ఒక కథ రాశాడట. ఈ కథను వివి వినాయక్ డైరెక్ట్ చేయనున్నాడు. నిజానికి విజయేంద్ర ప్రసాద్ రాసిన కథలకు ఎక్కువుగా రాజమౌళినే దర్శకుడు. కాకపోతే ఆయన రాసిన ప్రతీ కథను రాజమౌళి డైరెక్ట్ చేయలేదు. కొన్ని కథల్ని ఆయన బయటవాళ్ళు కూడా చేశారు.
Also Read: రిపీట్ అవుతున్న కాంబో.. సక్సెస్ రిపీట్ అవుతుందా?
అందుకే ఈ క్రమంలో వినాయక్ కోసం ఒక కథ రాయాలని విజేంద్ర ప్రసాద్ ఫిక్స్ అయ్యారట. అన్నట్టు ఇప్పుడాయన పవన్ కల్యాణ్ కోసం ఓ కథ రెడీ చేస్తున్నారన్నది టాలీవుడ్ టాక్. ఇప్పటికే ఈ వార్తలు వైరల్ కూడా అయ్యాయి. పైగా విజయేంద్ర ప్రసాద్ కి పవన్ అంటే చాలా ఇష్టమట. ఆ ఇష్టమే.. పవన్ కి కథ రాయించిందట. ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెబుతూ.. బాహుబలి ఇంట్రవెల్ సీన్‌కి.. పవన్ కల్యాణ్‌నే స్ఫూర్తి అని కూడా విజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్