Balakrishna-Nagarjuna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నందమూరి తారక రామారావు గారి నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు సైతం కెరియర్ స్టార్టింగ్ లోనే వరుసగా మాస్ సినిమాలు చేస్తూ మాస్ హీరోగా ఎదిగాడు. తండ్రికి తగ్గ తనయుడిగా గొప్ప పేరును సంపాదించుకోవడమే కాకుండా ప్రేక్షకుల్లో విశేషమైన క్రేజ్ ను మూటగట్టుకున్నాడు. ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చేవి అందువల్లే ఆయన అంటే యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరికి చాలా ఇష్టం ఏర్పడింది. ప్రస్తుతం ఈ ఏజ్ లో కూడా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తూన్నాడు… ఇక బాలయ్య బాబు తన కెరియర్ లో ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించాడు. అయితే ఒక సినిమాలో నటించి ఉంటే ఆయన క్రేజ్ అనేది మరింత భారీరేంజ్ కి వెళ్ళిపోయేదని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
Also Read : యమదొంగ’ రీ రిలీజ్ కి డిజాస్టర్ అడ్వాన్స్ బుకింగ్స్..ఎంత గ్రాస్ వచ్చిందంటే!
ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే రాఘవేంద్రరావు (Raghavendra Rao) దర్శకత్వంలో అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా వచ్చిన అన్నమయ్య (Annamayya) సినిమాని మొదట బాలకృష్ణ (Balakrishna)గారితో చేయాలని ప్రొడ్యూసర్స్ అనుకున్నారట. ఎందుకంటే ఎన్టీఆర్ చాలా పౌరాణిక సినిమాలు చేశాడు కాబట్టి ఆయన వారసుడు అయిన బాలయ్య ఈ మూవీ చేస్తే మంచి బజ్ ఉంటుందని వాళ్ళు ప్లాన్ చేశారట…
కానీ బాలకృష్ణ దానికి నో చెప్పడంతో ఆ అవకాశం నాగార్జునకు వెళ్ళింది. ఇక మొత్తానికైతే అన్నమయ్య సినిమా భారీ ప్రభంజనాలను సృష్టించడమే కాకుండా నాగార్జునకు సైతం నటుడిగా గొప్ప పేరును తీసుకొచ్చింది. ఇక అప్పటివరకు రొమాంటిక్ సినిమాలను చేస్తూ వచ్చిన నాగార్జున ఒక్కసారిగా భక్తిరస భావంతో అన్నమయ్య కీర్తనలను పాడుతూ ప్రేక్షకులను అలరించడమే కాకుండా వెంకటేశ్వర స్వామి భక్తితో జీవించిన అన్నమయ్య ఎలాగైతే ఉంటాడో నాగార్జున మన కళ్ళకు కట్టినట్టుగా తెరమీద చూపించాడు.
మరి ఈ సినిమా బాలకృష్ణ చేసి ఉంటే ఇంత భారీ గుర్తింపు వచ్చేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి…ఒక సారి అన్నమయ్య పాత్రలో నాగార్జున ను చూసిన తర్వాత తను తప్ప వేరే ఎవరు ఆ పాత్రను అంత బాగా చేయలేరు అనే అంతలా తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. మరి మొత్తానికైతే ఆ తర్వాత బాలయ్య బాబు పాండురంగడు (Pandu Rangadu), శ్రీరామరాజ్యం (Sri Ramarajyam) లాంటి పౌరాణిక సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేశాడు…