Balakrishna
Balakrishna: నందమూరి తారక రామారావు నటవారసుడిగా బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆయన ప్రస్థానం మొదలైంది. చిన్నప్పటి నుండే బాలకృష్ణను ఎన్టీఆర్ ఆ దిశగా ప్రోత్సహించారు. ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన ‘తాతమ్మకల’ బాలకృష్ణ డెబ్యూ మూవీ. బాలకృష్ణ నటుడిగా మారి 50 ఏళ్ళు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిరంజీవి అతిథిగా ఈ వేడుకకు హాజరయ్యారు.
బాలకృష్ణ నాలుగు తరాల హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. విజయశాంతి నుండి ప్రగ్యా జైస్వాల్ వరకు.. అనేక మంది భామలు ఆయనతో రొమాన్స్ చేశారు. పదుల సంఖ్యలో బాలకృష్ణ హీరోయిన్స్ లిస్ట్ ఉంటుంది. అయితే బాలకృష్ణకు ముగ్గురు హీరోయిన్స్ చాలా ప్రత్యేకం అట. వారే తనకు బాగా నచ్చిన హీరోయిన్స్ అని వెల్లడించారు. విజయశాంతికి బాలకృష్ణ మొదటి ర్యాంక్ ఇచ్చాడు. తన ఫేవరేట్ హీరోయిన్స్ లో విజయశాంతికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందని చెప్పారు.
లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి.. హీరోలతో సమానమైన స్టార్డం, ఫేమ్ అనుభవించారు. ఇక బాలకృష్ణ-విజయశాంతి కాంబోలో చాలా సినిమాలు తెరకెక్కాయి. ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ వంటి బ్లాక్ బస్టర్స్ లో నటించారు. కాగా నిప్పురవ్వ మూవీ అనంతరం వీరు కలిసి సినిమాలు చేయలేదు. ఆ మూవీ కారణంగా విబేధాలు తలెత్తాయనే వాదన ఉంది.
బాలయ్య మెచ్చిన మరొక హీరోయిన్ రమ్యకృష్ణ. వీరి కాంబోలో కూడా చాలా సినిమాలు తెరక్కాయి. బంగారు బుల్లోడు బ్లాక్ బస్టర్ గా ఉంది. బాలకృష్ణ-రమ్యకృష్ణ నటించిన చిత్రాల్లో చాలా పరాజయం పొందాయి. బాలకృష్ణ కెరీర్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ గా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాల్లో సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది. భలేవాడివి బాసు, సీమ సింహం చిత్రాల్లో సైతం వీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. బాలకృష్ణ మెచ్చిన మూడో హీరోయిన్ సిమ్రాన్ అట. అదన్నమాట సంగతి.
ప్రస్తుతం బాలకృష్ణ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన డాకు మహారాజ్ హిట్ స్టేటస్ అందుకుంది. నెక్స్ట్ బోయపాటి శ్రీనుతో అఖండ 2 చేస్తున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అఖండ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి
Web Title: Balakrishna liked those three heroines do you know anyone
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com