Balakrishna-Jr NTR Multistarrer: మల్టీస్టారర్ సినిమాలు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి. నిజానికి మల్టీస్టారర్ సినిమాలకు నాంది పలికింది నందమూరి కుటుంబమే. ఆ రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో మల్టీస్టారర్ చిత్రాలలో నటించారు. అలాగే తాను దర్శకత్వం వహించే చిత్రాల్లో కూడా ఎక్కువగా వేరే హీరోలనే పెట్టి సినిమాలు తీశారు. ఆ రకంగా తొలి తరంలోనే మల్టీస్టారర్ లకు తెలుగు సినిమా ఇండస్ట్రీ పెట్టింది పేరు అయింది.

అదే ఆనవాయితీని కొనసాగిస్తూ కృష్ణ, శోభన్ బాబు కూడా మల్టీస్టారర్ చిత్రాల్లో కలిసి నటించారు. ఇక ఆ తర్వాత తరం హీరోలు మాత్రం మల్టీస్టారర్ల జోలికి పోలేదు. నిన్నటి తరం స్టార్ హీరోలుగా చలామణి అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకీ, నాగ్ లు ఎవరూ కలిసి నటించలేదు. గతంలో నాగార్జున – బాలయ్య కలిసి ఓ సినిమా చేయాలనుకున్నారు.
Also Read: Kalyan Ram: “అఖండ” సినిమాలోని జై బాలయ్య పాటపై స్పందించిన… హీరో కళ్యాణ్ రామ్
అదే గుండమ్మ కథ సీక్వెల్. అయితే, కథ పర్ఫెక్ట్ గా రాకపోవడంతో మొత్తానికి నాగార్జున ఆ సినిమా చేయలేను అంటూ సైడ్ అయిపోయాడు. దాంతో బాలయ్య కూడా ఆ సినిమాను పక్కన పెట్టేశాడు. ఇక చాలా కాలంగా బాలకృష్ణ – జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తే బాగుంటుంది అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.
నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో కల కంటున్న కలయిక ఇది. ఇద్దరు నందమూరి హీరోలు కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే.. రికార్డులు బద్దలు అవ్వడం ఖాయం అంటూ సినిమా పండితులు కూడా ముక్తకంఠంతో ముక్తాయిస్తున్నారు. భవిష్యత్తులో ఈ కాంబోలో ఓ సినిమా రావొచ్చు అని నమ్మకం అయితే ఉంది. ఇలాంటి తరుణంలో “అఖండ” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య బన్నీతో కలిసి పోయిన విధానం చూసి అందరూ షాక్ అయ్యారు.
Also Read: Producer Suresh Babu:మరో మూవీని కూడా ఓటీటీ లో రిలీజ్ చేయనున్న నిర్మాత సురేష్ బాబు… కారణం ఏంటంటే ?

బాలయ్యలో చాలా మార్పు వచ్చింది. చిన్న హీరోలను కూడా గౌరవిస్తున్నాడు. అలాంటప్పుడు కచ్చితంగా తారక్ ను కూడా కలుపుకుపోతాడు అనే నమ్మకం కూడా నెటిజన్లలో ఎక్కువ అవుతుంది. పైగా బాలయ్య నిన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి ప్రస్తావిస్తూ.. తమ్ముడు రామ్ చరణ్ అని, ఆ తర్వాత మన జూనియర్ ఎన్టీఆర్ అని పలికాడు. కాబట్టి వీరిద్దరి కలయికలో సినిమా రావొచ్చు.