https://oktelugu.com/

Devara : దేవర సినిమా ప్రొడ్యూసర్ అయిన సుధాకర్ కి కొరటాల శివ కు మధ్య ఉన్న సంబంధం ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది స్టార్ హీరోలు ప్రస్తుతం తమదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు...అందులో భాగంగానే మంచి విజయాలను కూడా సాధిస్తున్నారు...

Written By:
  • NARESH
  • , Updated On : September 18, 2024 / 10:55 AM IST

    Devara film producer Sudhakar and Koratala Siva

    Follow us on

    Devara : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం చాలామంది ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక దాంతో పాటుగా ఈ సినిమాకు సంబంధించిన టిక్కెట్ల రేట్ ను కూడా భారీ రేంజ్ లో పెంచినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన బెనిఫిట్ షోస్, ఫ్యాన్స్ షోస్ ని కూడా స్పెషల్ గా వేయబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తన హవాని చూపించడం పక్కా అంటూ చాలామంది ఎన్టీఆర్ అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి బాలీవుడ్ లో ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక అల్లు అర్జున్ చేసిన పుష్ప సినిమా విధానికి వస్తే ఈ సినిమా తెలుగులో పెద్దగా ఆడలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం మంచి విజయాన్ని సాధించింది. అలా మన ప్రేక్షకులకు నచ్చిన సినిమాలు వాళ్లకు నచ్చకపోవచ్చు. మనకు నచ్చని సినిమాలు వాళ్లకు నచ్చవచ్చు. ఇక ఏది ఏమైనా కూడా దేవర సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందని, పుష్ప రేంజ్ లో బాలీవుడ్ లో సత్తా చాటుతుందనే అంచనల్సితే ఉన్నాయి. ఇక అలాగే ఈ సినిమా కూడా ఎన్టీఆర్ కు మంచి గుర్తింపు ను తీసుకొస్తుందని ఆయన భావిస్తున్నాడు. మరి అతను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

    ఇక ఈ సినిమాకి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని ఇద్దరూ ప్రొడ్యూసర్లు అయిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇందులో సుధాకర్ మిక్కిలినేని ‘యువ సుధ ఆర్ట్స్’ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఈ సినిమాని భారీ రేంజ్ లో నిర్మిస్తూ ఉండడం చాలా మంచి విషయం అనే చెప్పాలి.

    ఇక యువ సుధ బ్యానర్ స్థాపించిన మిక్కిలినేని సుధాకర్, అలాగే కొరటాల శివ ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి చాలా మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనలో చాలామందికి తెలియదు. వీళ్ళు బీటెక్ చదువుకుంటున్న సమయంలోనే క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఇక అందులో భాగంగానే మొదటి నుంచి కూడా వీళ్లకు సినిమా అంటే పాషన్ ఉండడంతో సినిమా పరంగా కూడా వీళ్లు ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చారు.

    ఇంకా ఇప్పుడు కొరటాల శివ స్టార్ డైరెక్టర్ కావడంతో మిక్కిలినేని సుధాకర్ కొరటాలతో సినిమా చేయడానికి సిద్ధమై ఈ భారీ ప్రాజెక్టుకైతే తెర లేపాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో సుధాకర్ లాభాల బాట పడుతాడా లేదంటే కొరటాల అతనికి నష్టాలు మిగులుస్తాడా అనేది తెలియాల్సి ఉంది…