Balakrishna: అందరిదీ ఒక బాధ అయితే.. దర్శకుడు ‘సంపత్ నంది’ది మరో బాధ. సినిమా ఛాన్స్ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు. తన డైరెక్షన్ లో బాలయ్య కాంబినేషన్ లో ఓ సినిమా చేయాలని తెగ కష్టపడుతున్నాడు. గతంలో బాలయ్య సినిమా కోసం దాదాపు ఆరు నెలలు సంపత్ నంది కష్ట పడ్డాడు. కానీ, సంపత్ నంది వర్క్ బాలయ్యకి నచ్చలేదు అని టాక్ ఉంది.

దాంతో బాలయ్య, సంపత్ నందికి డేట్స్ ఇవ్వలేదు. ఇంత జరిగినా.. సంపత్ నంది మాత్రం బాలయ్య కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ‘అఖండ’ విడుదలకు ముందు నుంచే సంపత్ నంది.. బాలయ్య చుట్టూ తిరుగుతున్నాడు. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతానికి అయితే కరోనా కారణంగా ఇంటికే పరిమితం అయ్యాడు.
Also Read: Royal Enfield motorcycles : బుల్లెట్ బండికి ‘నవతరం’ సింగారింపులు
అందుకే.. ఈ ఖాళీ సమయాన్ని ఉపయోగించుకోవాలని బాలయ్య కథలు వినడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో సంపత్ నంది దగ్గర కూడా మరో కొత్త విన్నాడు. బాలయ్యకి కథ నచ్చింది. మరి డేట్లు ఇస్తాడా ?, ఇప్పుడు ఇదే డౌట్. పైగా బాలయ్యకి మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఐతే, సంపత్ నంది చెప్పిన కథ విషయంలో బాలయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.
ఇప్పటివరకు క్లారిటీ అయితే ఇవ్వలేదు గానీ.. సినిమా అయితే చేయాలని ఫిక్స్ అయ్యాడట. కానీ వచ్చే ఏడాది చివర్లో మాత్రమే బాలయ్య సినిమా చేస్తాడట. నిజానికి సంపత్ నంది… ఈ గ్యాప్ లో మరో సినిమా చేసుకొని రావొచ్చు. కానీ, బాలయ్యతో తాను ప్లాన్ చేసిన సినిమాని పూర్తి చేసిన తర్వాతే మరేదైనా అని పట్టుదలగా ఉన్నాడు సంపత్ నంది.

అందుకే, ఎప్పటికప్పుడు బాలయ్యకు కథలో బెటర్ మెంట్స్ చెబుతూ వస్తున్నాడు. అసలు సంపత్ నంది ఇంత పట్టుదలగా ఎందుకు ఉన్నారు చాలా మంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు కూడా. కానీ, సంపత్ నంది కారణాలు సంపత్ నందికి ఉన్నాయి. ఐతే, బాలయ్యతో అసలు ఎప్పుడు సినిమాని మొదలుపెట్టి, ఎప్పుడు పూర్తి చేసి విడుదల చేస్తారో అనేది చూడాలి.
అనేక అడ్డంకుల మధ్య, పుకార్ల మధ్య, కామెంట్స్ మధ్య సంపత్ నంది, బాలయ్యతో సినిమాని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయగలడా ? ఇంతకీ ఈ సారి అయినా సంపత్ నందికి బాలయ్య ఛాన్స్ ఇస్తాడా ? చూడాలి.
Also Read:Sammathame 2nd Day Collections: ‘సమ్మతమే’ 2 డే కలెక్షన్స్.. రిజల్ట్ ఇదే !