spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna And Chiranjeevi: చిరంజీవి సినిమాలో బాలయ్య గెస్ట్ అప్పిరియన్స్ ఇస్తున్నాడా..? బాబీ ఏం...

Balakrishna And Chiranjeevi: చిరంజీవి సినిమాలో బాలయ్య గెస్ట్ అప్పిరియన్స్ ఇస్తున్నాడా..? బాబీ ఏం చెప్పి ఒప్పించవయ్యా..?

Balakrishna And Chiranjeevi: గత 50 సంవత్సరాలు నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఎనలేని సేవలను అందిస్తున్న నటుడు చిరంజీవి… ఇండస్ట్రీకి ఎంతమంది హీరోలు వచ్చిన కూడా చిరంజీవిని టచ్ చేసే రేంజ్ లో వాళ్ళు ఎదగలేకపోయారు. కారణమేదైనా కూడా సోలోగా ఇండస్ట్రీకి వచ్చిన చిరంజీవి తనదైన రీతిలో సత్తా చాటుకోవడం అనేది మామూలు విషయం కాదు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని మెప్పించగలిగే కెపాసిటి ఆయనకు మాత్రమే సొంతం… అలాంటి చిరంజీవి 70 సంవత్సరాల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీని ఇస్తు ముందుకు సాగడం అనేది మామూలు విషయం కాదు. రీసెంట్ గా ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు… అలాంటి చిరంజీవి ఇప్పుడు మరో కొత్త సినిమా చేస్తున్నాడు. బాబీ డైరెక్షన్లో చేస్తున్న ఈ సినిమా మీద చిరంజీవి భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇప్పటికే కథ మొత్తాన్ని లాక్ చేసిన దర్శకుడు మార్చి నెల నుంచి ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాని పక్క ప్రణాళికతో రూపొందించబోతున్నడట…

ఇక ఈ సినిమాలో చిరంజీవి ఒక 50 సంవత్సరాల పైబడిన వయస్సు గల వ్యక్తి క్యారెక్టర్ ని పోషిస్తున్నాడు. మొత్తానికైతే చిరంజీవి ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడట… బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇంతకుముందు వాల్తేరు వీరయ్య సినిమా వచ్చింది. ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది…

ఇక ఈ సినిమాలో నట సింహం బాలయ్య బాబుని కూడా భాగం చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. బాలయ్య బాబుతో బాబీ డాకు మహారాజ్ అనే సినిమా చేశాడు. ఈ సినిమాతో బాలయ్య బాబు కి భారీ సక్సెస్ ని కట్టబెట్టాడు. అలాంటి బాబీ చిరంజీవి బాలయ్య బాబుని కలుపుతూ సినిమా చేయడం అనేది మామూలు విషయం కాదు. ఈ సినిమా చేయడానికి ఇద్దరు హీరోలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇందులో బాలయ్య బాబు క్యారెక్టర్ 15 నిమిషాల వరకు ఉంటుందట. చిరంజీవి బాలయ్య ఓకే ఫ్రేమ్ లో కనిపిస్తే మెగా అభిమానులకు, నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular