Balakrishna Gopichand Malineni Movie: ‘అఖండ 2’ వంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత నందమూరి బాలకృష్ణ , తనతో వీర సింహా రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన గోపీచంద్ మలినేని తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అయ్యాయి. ముందుగా ఈ సినిమాని పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాలని అనుకున్నారట. కానీ భారీ బడ్జెట్ అయ్యే పరిస్థితి ఉండడం , బాలయ్య బాబు కి అంతటి మార్కెట్ లేకపోవడం తో ఆ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ని పక్కకు నెట్టేసి , మామూలు కమర్షియల్ కథ ని సిద్ధం చేశారని అంటున్నారు. ఇవన్నీ రూమర్స్ కాదు, నిజమే అని తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది.
Also Read: గ్రాండ్ గా జరిగిన విజయ్ దేవరకొండ, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్..సెలెబ్రిటీలు ఎవరెవరు వచ్చారంటే!
మంచు మోహన్ బాబు రెండవ తనయుడు మంచు మనోజ్ ఈ చిత్రం లో విలన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట . ఒకప్పుడు హీరో గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన మనోజ్, ఆ తర్వాత బాగా గ్యాప్ తీసుకొని ‘భైరవం ‘ చిత్రం తో విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. కానీ ఆ తర్వాత ఆయన తేజ సజ్జ హీరో గా నటించిన ‘మిరాయ్ ‘ చిత్రం లోనూ విలన్ గా నటించాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ హీరో గా రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇలా ఒకపక్క హీరో గా చేస్తూనే, మరో పక్క బాలయ్య , గోపీచంద్ మూవీ లో విలన్ గా నటించడానికి ఒప్పుకున్నాడు మంచు మనోజ్.
గతంలో మంచు మనోజ్ హీరో గా నటించిన ‘ఊ కొడతారా ..ఉలిక్కి పెడుతారా ‘ చిత్రం లో కీలక పాత్ర పోషించాడు బాలయ్య . ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ కాకపోయినా, బాలయ్య కారణంగా మంచి ఓపెనింగ్ వసూళ్లు అయితే వచ్చాయి. మళ్లీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతుంది. ఈసారి వీళ్లిద్దరు ఢీ అంటే ఢీ అని సవాళ్లు విసురుకుంటూ వెండితెర పై ఫైట్ చేసుకోబోతున్నారు. మరి ఆడియన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. త్వరలోనే మనోజ్ కి సంబంధించి మూవీ టీం ఒక అధికారిక ప్రకటన చేయబోతుంది.