తాజాగా బాలయ్య ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో అడ్డు అదుపు లేని కామెంట్స్. ముఖ్యంగా దివంగత శ్రీదేవి పై బోల్డ్ కామెంట్స్ చేయడం, రెహమాన్ ఎవడో నాకు తెలియదు అంటూ చులకనగా మాట్లాడటం ఒక్క బాలయ్యకే సాధ్యం అయింది అనుకుంటా.
ఏది ఏమైనా ఈ ఇంటర్వ్యూతో మాత్రం బాలయ్య ఇమేజ్ బాగా డామేజ్ అయింది. అసలుకే బాలయ్యకి ఇమేజ్ తక్కువ. దానికి తోడు ఈ తాజా వ్యాఖ్యలతో బాలయ్య తన పరువును తనే మరింత దెబ్బ తీసుకున్నారు.
అయినా అసలు సంబంధం లేకుండా బాలయ్య ఆస్కార్ అవార్డ్ గ్రహీత రెహమాన్ గురించి కామెంట్స్ చెయ్యడం ఏమిటి ? అంటూ బాలయ్య పై నేషనల్ వైడ్ గా విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
నేషనల్ మీడియా కూడా బాలయ్యను విమర్శిస్తూ అనేక కథనాలు రాసుకొచ్చింది. ముఖ్యంగా ఈ రోజు సోషల్ మీడియా అంతా బాలయ్యకి వ్యతిరేకంగా తెగ కామెంట్స్ వస్తున్నాయి. పదాలతో చెప్పలేని జోక్స్ తో బాలయ్య పై ట్రోల్ చేయడం ప్రేక్షకులకు బాగా అలవాటు లేండి. ఇకనైనా బాలయ్య తన వైఖరి మార్చుకుంటే మంచిది.