Balakrishna- Mahesh Babu: టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ కి ఉన్న మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఆయన ఫాన్స్ ని చూస్తే మాస్ ఫాన్స్ అంటే ఇలాగె ఉండాలిరా అనేంతలా అనిపిస్తుంది..ఇటీవల కాలం లో బాలయ్య బాబు క్రేజ్ యూత్ లో కూడా బాగా పెరిగిపోయింది..అఖండ సినిమా భారీ విజయం సాధించడంతో తో పాటు ఆహా మీడియా లో ప్రసారమయ్యే ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో ఆయనని యూత్ తో పాటుగా ఫామిలీ ఆడియన్స్ కి కూడా బాగా దగ్గర చేసింది.

దీనితో బాలయ్య బాబు కి నేటి తరం స్టార్ హీరోలతో సరిసమానమైన క్రేజ్ వచ్చేసింది..ఆయన బయట ఎక్కడికెళ్లినా జనాలు బ్రహ్మరధం పెట్టేస్తున్నారు..కెరీర్ ముగించుకోవాల్సిన వయస్సులో బాలయ్య బాబు తన పీక్ ని ఎంజాయ్ చేస్తూ అభిమానులకు గూస్ బంప్స్ రప్పిస్తున్నాడు..ఇక లేటెస్ట్ గా ఈయన కుర్ర హీరో విశ్వక్ సేన్ నటిస్తూ దర్శకుడిగా మరియు నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.
ఈ ఈవెంట్ హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతం లో ఉండే మహేష్ బాబు AMB సినిమాస్ లో అట్టహాసం గా జరిగింది..ఈ ఈవెంట్ కి బాలయ్య బాబు వస్తున్నాడని అధికారిక ప్రకటన రాగానే నందమూరి అభిమానులు వేలాదిగా AMB సినిమాస్ కి తరలి వచ్చారు..బాలయ్య బాబు ఎంట్రీ కోసం..ఆయనని చూడడం కోసం గంటల తరబడి ఆ మాల్ లోనే ఎదురు చూస్తూ ఉన్నారు..ఎప్పుడైతే బాలయ్య బాబు వచ్చాడు అని తెలిసిందే..అభిమానులందరూ ఒక్కసారిగా మీదపడిపోయారు.

సెక్యూరిటీ గార్డ్ లోపాలకి పంపేందుకు షట్టర్ తెరుస్తున్న సమయం లో అభిమానుల అత్యుత్సహం తో ఒకరిమీద ఒకరు పడడం వాళ్ళ షట్టర్ విరిగిపోయింది..ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యినందుకు గాను విశ్వక్ సేన్ మానేజ్మెంట్ కి నష్టపరిహారం చెల్లించారట..ఇది ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది..ఇది వరుకు AMB సినిమాస్ లో ఎన్నో ఈవెంట్స్ జరిగినప్పటికీ ఎప్పుడు కూడా ఇలా జరగలేదట..బాలయ్య బాబు మాస్ ఫాన్స్ తో మాములుగా ఉండదుమరి.