Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేర్లు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. ఈ నలుగురు అందగాళ్లే. సినిమాలలో నటన విషయంలో కూడా ఈ నలుగురు తమకంటూ ప్రత్యేక మార్కును క్రియేట్ చేసుకున్నారు. వీళ్ళు సరి సమానంగా నటిస్తూ ఉంటారు. అలాగే మంచితనంలో కూడా ఈ నలుగురు హీరోలు ఒకే లెవెల్ లో ఉన్నారు అని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలి అంటే అన్ని రకాల లో కూడా వీళ్లు సరి సమానం. అయితే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఎదుర్కొన్న సమస్యలను మాత్రం బాలకృష్ణ ఇప్పటివరకు ఎదుర్కోలేదు అని చెప్పాలి. ఒకే ఒక్క విషయంలో ఈ ముగ్గురు హీరోలు ఎదుర్కొన్న సమస్యను బాలకృష్ణ ఎదుర్కోలేదు. ప్రస్తుతం ఈ విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు. సినిమా ఇండస్ట్రీ అంటేనే రూమర్స్ అనే విషయం తెలిసిందే. ఎటువంటి రూమర్ లేకుండా ఏ నటుడు కూడా హీరో అవ్వలేడు. కానీ నందమూరి బాలకృష్ణ మాత్రం ఇటువంటివి లేకుండానే హీరో అయిపోయాడు అని తెలుస్తుంది. ఆయన ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలను సైతం తన నటనతో గజగజ వణికించేస్తున్నారు. లేటెస్ట్గా నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజు సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఇక ఈ సినిమాకు ముందు రిలీజ్ అయిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు బాలకృష్ణ ఎంత మంచి టాలెంటెడ్ అని చెప్పడానికి. అయితే బాలకృష్ణ సినిమా కెరియర్ లో ఇప్పటివరకు ఏ హీరోయిన్ తో కూడా అఫైర్ ఉన్నట్టు రూమర్సే రాలేదు.
అయితే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ గా పేరు తెచ్చుకున్న చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కి కొంతమంది హీరోయిన్స్ తో అఫైర్లు ఉన్నట్లు అప్పట్లో రకరకాల రూమర్స్ వినిపించేవి. ఫలానా హీరోయిన్ తో ఆ హీరో ఎఫైర్ నడుపుతున్నారు అంటూ వార్తలు వైరల్ అయ్యేవి. కానీ బాలయ్య లైఫ్ లో మాత్రం ఇప్పటివరకు అలాంటి రూమర్ ఒకటి కూడా వినిపించలేదు. ఈ విషయాన్ని నందమూరి అభిమానులు సామాజిక మాధ్యమాల్లో గట్టిగా ట్రెండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటె బాబీ దర్శకత్వం లో బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమా బాలయ్య తన నటనతో మరోసారి అదరకొట్టారు.సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతుంది.ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వం లో అఖండ 2 సినిమాలో నటిస్తున్నారు.గతం లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా ఘనవిజయం సాధించి థియేటర్లలో అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించిన సంగతి తెలిసిందే.