Bhairava Dweepam : అప్పటి ముచ్చట్లు: కురూపిగా మారి 11 రోజులు అన్నం మానేసిన స్టార్ హీరో..

Star Hero : సినీ ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాలు చూపించేందుకు కొందరు డైరెక్టర్లు వినూత్న చిత్రాలను తీసుకొస్తుంటారు. ఈ క్రమంలో స్టార్ హీరోలతో ప్రయోగాలు చేయిస్తుంటారు. ఇలాంటి సమయంలో కొందరు హీరోలు తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. అవసరమైన ఆహారాన్ని కూడా మానేయాల్సి ఉంటుంది. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ‘ఐ’ సినిమా కోసం విక్రమ్ గూని వ్యక్తిలా నటించడానికి ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. అయితే ఇలాంటి ప్రయోగాలు ఆనాడే సింగీతం శ్రీనివాసరావు చేశారు. ఆయన తీసిన ప్రయోగాత్మక చిత్రాల్లో […]

Written By: Srinivas, Updated On : April 16, 2023 5:20 pm
Follow us on

Star Hero : సినీ ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాలు చూపించేందుకు కొందరు డైరెక్టర్లు వినూత్న చిత్రాలను తీసుకొస్తుంటారు. ఈ క్రమంలో స్టార్ హీరోలతో ప్రయోగాలు చేయిస్తుంటారు. ఇలాంటి సమయంలో కొందరు హీరోలు తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. అవసరమైన ఆహారాన్ని కూడా మానేయాల్సి ఉంటుంది. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ‘ఐ’ సినిమా కోసం విక్రమ్ గూని వ్యక్తిలా నటించడానికి ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. అయితే ఇలాంటి ప్రయోగాలు ఆనాడే సింగీతం శ్రీనివాసరావు చేశారు. ఆయన తీసిన ప్రయోగాత్మక చిత్రాల్లో ‘భైరవ ద్వీపం’ ఒకటి. ఈ సినిమా కోసం హీరో 11 రోజులు అన్నం మానేయాల్సి వచ్చిందట.

2023 ఏప్రిల్ 14న వరకు ‘భైరవ ద్వీపం’ 29 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ సినిమా విశేషాలను సినిమాకు సంబంధించిన వాళ్లు రివీల్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలు బాలకృష్ణ చేసిన సాహసం మాములుది కాదనే చెప్పాలి. రాకుమారి కోసం తన అందం చెదిరిపోయే పాత్రలో నటించాలి. అంటూ కరూపి పాత్రను వేసుకోవాలి. ఈ విషయాన్ని బాలకృష్ణకు చెప్పినప్పుడు ఆయన ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పారు. ఈ కరూపి పాత్రలో బాలకృష్ణ నటనను చూసి మిగతా నటులంతా షాక్ అయ్యారు.

ఈ పాత్ర కోసం మేకప్ వేయడానికి రెండు గంటల సమయం పట్టేదట. మళ్లీ తీసేయడానికి మరో రెండు గంటలు పట్టేదట. అయితే భోజనం సమయం వచ్చినప్పుడు ఈ గెటప్ ను బాలకృష్ణ తీసేవారు కాదట. మేకప్ తీసి, వేయడానికి సమయం చాలా పడుతుండడంతో ఆయన ఆహారాన్ని తీసుకోలేదట. కేవలం జ్యూస్ తోనే కాలం గడిపాడట. ఇలా 11 రోజుల పాటు ఆహారం తీసుకోకుండా కేవలం జ్యూస్ మీదనే ఆధారపడి కరూపి పాత్రను సక్సెస్ చేశారట.

బాలకృష్ణ నటించిన ఈ సినిమా ఆయన కెరీర్ ను మలుపు తిప్పింది. ఇప్పటికీ ఇలాంటి జానపద చిత్రం మరోకటి రాలేదని కొందరు చెప్పుకుంటారు. ఇందులో హీరోయిన గా రోజా నటించారు. ప్రత్యేక పాత్రలో రంభ కనిపిస్తారు. సత్యానారాయణ, గిరిబాబు, కేఆర్ విజయ లాంటి వారు తమ పాత్రలను మెప్పించారు. వచ్చే ఏడాది ఈ సినిమా 30 వసంతాలు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ‘బైరవ ద్వీపం’ గురించి ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది.