Balakrishna Daughter Tejaswini: సినీ నటుల వారసులు వాణిజ్య ప్రకటనలు చేయడం కొత్తేం కాదు. ఇప్పుడు ఈ జాబితాలోకి ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె నందమూరి తేజస్విని చేరిపోయింది. ఆమె ఇటీవల ఒక కమర్షియల్ యాడ్ లో నటించింది. ఆ యాడ్ ఇప్పుడు టెలికాస్ట్ అవుతుంది.. ఆ యాడ్లో నందమూరి తేజస్విని సరికొత్తగా కనిపించింది. తేజస్వినికి కొంతకాలం క్రితం వివాహం జరిగింది.. ఆమె భర్త విశాఖపట్నం ఎంపీగా ఉన్నారు. గీతం విశ్వవిద్యాలయాన్ని నిర్వహిస్తున్నారు.. తేజస్విని దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు.
తేజస్విని ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ -2 సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. బాలకృష్ణ చేస్తున్న సినిమాలకు సంబంధించిన కథలను కూడా తేజస్విని వింటున్నారు. అఖండ -1 సినిమా నుంచి బాలకృష్ణ సినిమా కెరియర్ పూర్తిగా మారిపోయింది. అప్పటినుంచి ఆయన నటించిన ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. అఖండ, భగవంత్ కేసరి, వీర సింహారెడ్డి, డాకు మహారాజ్ సినిమాలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు బాలకృష్ణ అఖండ -2 సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. త్వరలోనే విడుదల కానుంది.
ఓవైపు బాలకృష్ణ నటిస్తున్న సినిమా వ్యవహారాలను చూసుకుంటున్న తేజస్విని.. స్వయంగా ఒక ప్రకటనలో కూడా నటించింది . సిద్ధార్థ ఫైన్ జువెలరీస్ అనే సంస్థకు ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. అంతేకాదు ఆ సంస్థ రూపొందించిన ఒక ప్రకటనలో కూడా నటించింది. అందులో తేజస్విని సరికొత్తగా కనిపించింది..ఈ ప్రకటన ఆసక్తికరంగా ఉంది. ఈ ప్రకటన చూసిన వారంతా తేజస్విని కొత్తగా కనిపిస్తోంది అని చెబుతున్నారు. మరోవైపు బాలకృష్ణ వేగా జువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.. అయితే ఇప్పుడు బాలకృష్ణ బాటలోనే ఆయన చిన్న కుమార్తె తేజస్విని కూడా నడుస్తున్నారు. ఆమె సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు. ఒక ప్రకటనలో కూడా నటించారు. సినీ కుటుంబంలో పుట్టిన తేజస్విని కి.. నటించడం కొత్త అయినప్పటికీ.. అందులో ఏమాత్రం బెరుకు ప్రదర్శించలేదు.
View this post on Instagram