Balakrishna Birth day : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు బాలకృష్ణ(Balakrishna)… ఈయన 1960 వ సంవత్సరం జూన్ 10 వ తేదీన జన్మించాడు. సీనియర్ ఎన్టీఆర్ కొడుకుగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య అన్ని జానర్స్ ను టచ్ చేస్తూ సినిమాలను చేస్తూ వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకొచ్చాడు…సినిమా ఎలాంటిదైనా అందులో ఆయన నటనతో ఆ పాత్రకి ఒక గొప్ప ఇమేజ్ ను తీసుకురావడంలో ఆయనకు ఆయనే సాటి… పౌరాణికం, జానపదం, సైన్స్ ఫిక్షన్ ఎలాంటి జానర్ లో అయినా సరే సినిమాను చేసి మెప్పించగలిగే కెపాసిటి ఉన్న హీరో కూడా తనే కావడం విశేషం… ఇక ఇప్పటివరకు ఆయన వందకు పైన చిత్రాల్లో నటించి గొప్ప కీర్తి ప్రతిష్టలను అందుకుంటున్నాడు… ఇక ఆయన ఇప్పటివరకు 17 సినిమాల్లో డ్యూయల్ రోల్ లో నటించాడు. ‘అధినాయకుడు’ (Adi Nayakudu) సినిమాలో త్రిబుల్ రోల్ లో నటించి మెప్పించాడు…
1987వ సంవత్సరంలో ఈయన చేసిన 7 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఏడు సినిమాలు సూపర్ సక్సెస్ లుగా నిలిచాయి. ‘పైసా వసూల్’ (Paisa Vasool) సినిమాలో ‘మామా ఎక్ పెగ్ లా’ అంటూ సింగర్ గా మారాడు. ‘అన్ స్టాపబుల్ షో’ తో హోస్ట్ గా మారి ఆ ప్రోగ్రామ్ ను ఇండియాలోనే టాప్ షో గా నిలిపాడు…ఇప్పటి వరకు ఎవ్వరు చేయనటువంటి భిన్నమైన పాత్రలను కూడా పోషించాడు. రీసెంట్ గా పద్మభూషణ్ అవార్డుని అందుకొని తన అభిమానుల్లో ఆనందాన్ని నింపాడు.
Also Read : ఒకే వేదిక పైకి ప్రధాని మోదీ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్!
ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉండడం ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి… ఇక హిందూపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా ఏంటో చూపించుకున్నాడు.
అటు రాజకీయంగా, ఇటు సినిమాలపరంగా సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్న బాలయ్య బాబు ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం అతని అభిమానుల్లో ఆనందాన్ని కలిగింపజేస్తుంది…ఇక రీసెంట్ గా నిన్న రిలీజ్ అయిన అఖండ 2 సినిమా టీజర్ అయితే అద్భుతంగా ఉందని అభిమానులందరు పండగ చేసుకుంటున్నారు.
సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాతో మరోసారి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధిస్తానని బాలయ్య బాబు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలను అందుకున్న ఆయన ఈ సినిమాతో మరో విజయాన్ని సాధించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది…
ఇక తన కెరియర్ లో 111వ సినిమాను కూడా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో చేయబోతున్నట్లుగా అనౌన్స్ చేశాడు. ఇక ఈ సినిమా మీద కూడా భారీ కసరత్తులను చేసి ఎలాగైనా సరే ఈ మూవీని సైతం సక్సెస్ ఫుల్ గా నిలపాలనే ప్రయత్నంలో బాలయ్య బాబు ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బాలయ్య బాబు ఇంకా చాలా సంవత్సరాల పాటు ఇలాగే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ సక్సెస్ లను అందుకోవాలని కోరుకుందాం…