Balakrishna- Thaman: నందమూరి బాలకృష్ణ కి సెకండ్ ఇన్నింగ్స్ ఇంత గొప్ప గా ఉండడానికి ప్రధాన కారణాలలో ఒకటి తమన్ అందించిన బ్లాక్ బస్టర్ మ్యూజిక్. ఆయనకీ బాలయ్య సినిమా అంటే చాలు పూనకాలు వచ్చేస్తుంది. అఖండ చిత్రం నుండి మొన్న విడుదలైన ‘డాకు మహారాజ్’ వరకు తమనే సంగీతం అందిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ‘అఖండ 2 ‘ చిత్రానికి కూడా ఆయనే సంగీతం సమకూరుస్తున్నాడు. తన ప్రతీ కొత్త సినిమాకి తమనే మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండాలని పట్టుబట్టే బాలయ్య, ఈసారి రూటు మార్చినట్టు తెలుస్తుంది. త్వరలోనే బాలయ్య బాబు, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రెండవ సినిమా రాబోతుంది. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించేందుకు అనిరుద్ ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. బాలయ్య, తమన్ మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిన ఈ సమయంలో ఈ చిత్రానికి ఆయన్ని పక్కన పెట్టడం ఇండస్ట్రీ లో పెద్ద చర్చకి దారి తీసింది.
గతంలో బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, తమన్ కాంబినేషన్ లో వచ్చిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రానికి తమన్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇతర హీరోల అభిమానులు కూడా ఎడిటింగ్స్ లో ఈ సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని వాడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి మరపురాని సంగీతం అందించిన తమన్ ని పక్కన పెట్టిన ఎఫెక్ట్ ఈ సినిమా మీద పడుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అనిరుద్ అందించే మ్యూజిక్ ఈమధ్య బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలను సృష్టిస్తుంది. అనిరుద్ అందించిన మ్యూజిక్ ని , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని పక్కన పెట్టి ఒక్కసారి దేవర చిత్రాన్ని ఊహించుకోండి?, ఆ ఊహనే ఎంతో దారుణంగా ఉంది కదూ. సగం సినిమా అనిరుద్ వల్లే అద్భుతంగా అనిపించింది.
టైటిల్ కార్డ్స్ దగ్గర నుండి ఎండ్ క్రెడిట్స్ వరకు అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ఊపిరిని పోసింది. కాబట్టి బాలయ్య సినిమాకి కూడా అదే రేంజ్ మ్యూజిక్ ని అందిస్తాడని బలమైన నమ్మకం తో ఉన్నారు అభిమానులు. కేవలం బాలయ్య సినిమాకి మాత్రమే కాదు, త్వరలో టీకేక్కబోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాకి కూడా అనిరుద్ మ్యూజిక్ అందించబోతున్నాడు. మెల్లగా టాలీవుడ్ లోకి అనిరుద్ దూసుకొచ్చేస్తున్నాడు. ఒక పక్క తమిళం లో ఊపిరి ఆడనంత బిజీ గా ఉన్నాడు అనిరుద్. ఇప్పుడు టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన మేనియా లో తమన్ కి అవకాశాలు తగ్గబోతున్నాయా?, ఆ ప్రమాదం అయితే ఉంది. ఎందుకంటే అనిరుద్ కి తెలుగు లో వస్తున్నాని ఆఫర్లు, తమన్ కి తమిళం లో రావడం లేదు. విజయ్ హీరో గా నటించిన ‘వారిసు’ చిత్రానికి మాత్రమే ఆయన సంగీతం అందించాడు, ఆ తర్వాత మాయం అయిపోయాడు.