https://oktelugu.com/

Balakrishna Another Surgery: బాలయ్య కి మరో సర్జరీ.. ఆందోళనలో ఫాన్స్

Balakrishna Another Surgery: కొద్దీ రోజుల క్రితం బాలయ్య బాబు చెయ్యికి కట్టు కట్టుకున్న ఫొటోలతో దర్శనం ఇచ్చే లోపు మా బాలయ్య బాబు కి ఏమైంది అంటూ అభిమానులు కంగారు పడిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే..ఆ కట్టు కట్టుకున్న చేతితోనే ఆయన అఖండ సినిమాని కూడా పూర్తి చేసారు..అఖండ సినిమా లో ఎంతో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా ‘జై బాలయ్య’ పాటకి సమయం లో కూడా బాలయ్య బాబు చెయ్యి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 26, 2022 / 02:51 PM IST
    Follow us on

    Balakrishna Another Surgery: కొద్దీ రోజుల క్రితం బాలయ్య బాబు చెయ్యికి కట్టు కట్టుకున్న ఫొటోలతో దర్శనం ఇచ్చే లోపు మా బాలయ్య బాబు కి ఏమైంది అంటూ అభిమానులు కంగారు పడిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే..ఆ కట్టు కట్టుకున్న చేతితోనే ఆయన అఖండ సినిమాని కూడా పూర్తి చేసారు..అఖండ సినిమా లో ఎంతో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా ‘జై బాలయ్య’ పాటకి సమయం లో కూడా బాలయ్య బాబు చెయ్యి తీవ్రంగా దెబ్బ తినే ఉన్నింది..ఆ దెబ్బ తిన్న చేతితోనే ఆయన పాటని పూర్తి చేసినట్టు ఆ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను అప్పట్లో పలు ఇంటర్వూస్ లో తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే..ఆహా లో బాలయ్య వ్యక్తగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ విత్ NBK ప్రోగ్రాం లో కూడా బాలయ్య చేతి కట్టుతోనే షో ని పూర్తి చేసారు..జిం చేస్తున్న సమయం లో అదుపు తప్పి కింద పడినప్పుడు చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది అని..కేర్ హాస్పిటల్ లో సర్జెరీ చేయించుకున్న తర్వాత ఇప్పుడు పర్లేదు అని అప్పట్లో చెప్పుకొచ్చాడు బాలయ్య.

    Balakrishna

    ఇది ఇలా ఉండగా ఇప్పుడు మళ్ళీ బాలయ్య బాబు మోకాళ్ళకు సర్జరీ చేయించుకున్న ఫోటో ఒక్కటి సోషల్ మీడియా లో నిన్నటి నుండి తెగ తిరుగుతుంది..ఇది చూసి అభిమానులు మళ్ళీ మా బాలయ్య బాబు కి ఏమైంది అంటూ కంగారు పడుతూ పోస్టులు వేశారు..కానీ బాలయ్య బాబు గురించి కంగారు పడాల్సిన అవసరమే లేదు అని , చాలా కాలం నుండి ఆయన మోకాళ్ళ నొప్పితో బాధపడుతూ ఉన్నారు అని..ఇటీవలే ఆయనకీ సర్జెరీ చేసాము అని..అభిమానులు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు అని బాలయ్య బాబు సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి..నిన్న కేర్ హాస్పిటల్స్ లో సర్జెరీ పూర్తి అయిన కాసేపు తర్వాత బాలయ్య బాబు హాస్పిటల్ స్టాఫ్ తో దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారింది.

    Also Read: KGF Krishna Ji: కేజీఎఫ్ లో కన్పించిన ‘తాత’.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే అవాక్కాల్సిందే..!

    అఖండ సినిమా తో బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సషనల్ హిట్ ని కొట్టిన బాలయ్య బాబు ఆ తర్వాత చెయ్యబొయ్యే సినిమాలు కూడా ఎంతో ఆచి తూచి చేస్తున్నాడు..ఒక్కప్పుడు బాలయ్య బాబు అవుట్ డేట్ అయిపోయిన డైరెక్టర్స్ తో సినిమాలు చేసేవాడు..అందుకే అంతకాలం ఆయన ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడాడు..కానీ ఇప్పుడు తానూ భవిష్యత్తులో చెయ్యబొయ్యే ప్రతి సినిమాకి క్రేజీ యంగ్ డైరెక్టర్స్ తోనే సెట్ చేసుకున్నాడు..ప్రస్తుతం క్రాక్ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని తో ఒక్క సినిమా చేస్తున్న బాలయ్య బాబు, ఈ సినిమా పూర్తి అయిన తర్వాత అనిల్ రావిపూడి తో ఒక్క సినిమా చేయనున్నాడు..ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తి అయిన తర్వాత బోయపాటి శ్రీను తో రెండు సినిమాలు చెయ్యబోతున్నాడు..ఒక్కటి అఖండ పార్ట్ 2 కాగా మరొక్కటి పొలిటికల్ సబ్జెక్ట్..ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో కెరీర్ లో ఎన్నడూ లేని పీక్ ఫామ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు బాలయ్య బాబు.

    Also Read: OTT Super Hit Movie: థియేటర్స్ లో అట్టర్ ఫ్లాప్.. కానీ OTT లో బంపర్ హిట్.. ఎంత లాభాలు వచ్చాయో తెలుసా???

    Recommended Videos:

    Tags