Bigg Boss 9 Telugu Srija: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో కంటెస్టెంట్స్ ప్రతీ ఒక్కరు నోరు జారుతున్నారు. ఎంతలా అంటే గతం లో ఏ సీజన్ లో కూడా చూడని రేంజ్ లో నోరు జారుతున్నారు. తీసుకొచ్చిన కంటెస్టెంట్స్ కూడా అలాగే ఉన్నారు మరి. ముఖ్యంగా వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా వచ్చిన రమ్య, మాధురి తో మాట్లాడుతూ ‘కళ్యాణ్ ఒక అమ్మాయిల పిచ్చోడు. అసలు అతను అలా అమ్మాయి మీద చేతులు వేస్తుంటే నాకే ఏదోలా అనిపించింది. నాపై అలా చేతులు వేస్తే క్రిందకు పడేసి తొక్కేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఇది ఒక అబ్బాయి క్యారక్టర్ పై చాలా బలమైన రిమార్క్. దీనిపై కళ్యాణ్ ఫైర్ అవ్వలేదు, ఆమె క్షమాపణలు చెప్పగానే చాలా కూల్ గా తీసుకొని వదిలేసాడు. పక్క రోజు రమ్య పై నామినేషన్స్ వేస్తాడేమో అని అనుకుంటే తనూజ పై వెయ్యాలని చూస్తాడు.
హౌస్ మేట్స్ తో పాటు, ఆడియన్స్ కూడా షాక్ కి గురైన సందర్భం ఇది. అయితే నేడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ ఒక్కొక్కరిగా వచ్చి హౌస్ మేట్స్ పై నామినేషన్స్ వేస్తారు. అందుకు సంబంధించిన ప్రోమోలు కూడా వచ్చాయి. వీరిలో కొంతమంది బిగ్ బాస్ హౌస్ లోనే ఉండిపోతారు, టైటిల్ కోసం మిగిలిన కంటెస్టెంట్స్ తో కలిసి పోటీ పడుతారు.ఆ కొంతమంది ఎవరు అనేది తెలియాలంటే ఈరోజు, రేపు వరకు ఆగాల్సిందే. అయితే శ్రీజ రీ ఎంట్రీ కోసం ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కాసేపటి క్రితమే విడుదల చేసిన ప్రోమో లో శ్రీజ కళ్యాణ్ ని నామినేట్ చేయడం మనమంతా చూసాము. అదేంటి కళ్యాణ్, శ్రీజ మంచి స్నేహితులు కదా, అయినప్పటికీ శ్రీజ ఎలా నామినేషన్ వేసింది అని మీ అందరికీ అనిపించొచ్చు, కానీ ఆమె చెప్పిన పాయింట్స్ చూస్తే ఇందుకు కదా శ్రీజ రీ ఎంట్రీ కావాలని కోరుకున్నాము అని అనిపించక తప్పదు.
కళ్యాణ్ నామినేట్ చేస్తూ ‘నువ్వు అమ్మాయిల పిచ్చోడివా..?’ అని అడుగుతుంది శ్రీజ. దానికి కళ్యాణ్ కాదు అని సమాధానం ఇస్తాడు. మరి నువ్వెందుకు డిఫెండ్ చేసుకోలేకపోయావు అని గట్టిగా శ్రీజ అడుగుతుంది. దానికి కళ్యాణ్ సమాధానం చెప్తూ ‘ఆ అమ్మాయి చాలా నిజాయితీగా నాకు క్షమాపణలు చెప్పింది, అందుకే వదిలేసాను’ అని అంటాడు. నీ క్యారక్టర్ మీద అంత నిందలు వేసిన తర్వాత కూడా, క్షమాపణలు చెప్పేసింది కదా, పర్లేదులే అని ఊరుకుంటావా అని అంటుంది శ్రీజ. ఇక ఆ తర్వాత తనూజ ని నామినేట్ చేస్తా అని చెప్పి ఎందుకు నామినేట్ చేయలేదు అని శ్రీజ కళ్యాణ్ ని నిలదీస్తుంది. అందుకు కళ్యాణ్ సమాధానం చెప్తూ ‘నేను చెప్పాలని అనుకున్న పాయింట్స్ మొత్తం రమ్య చెప్పేసింది. మళ్లీ కాపీ క్యాట్ లాగా చేయడం ఇష్టం లేక చెప్పలేదు’ అని అంటాడు కళ్యాణ్. అప్పుడు శ్రీజ ‘తనూజ ని నామినేట్ చేస్తే ఎక్కడ నెగిటివ్ అవుతానేమో అనే భయం తోనే నువ్వు నామినేట్ చేయలేదు’ అని అంటుంది.