Balakrishna And Gopichand Malineni: వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కు రీసెంట్ గా విడుదలైన ‘అఖండ 2’ చిత్రం పెద్ద స్పీడ్ బ్రేకర్ లాగా నిల్చింది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ అంటే, అది ఫ్లాప్ అవుతుందని అభిమానులే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఊహించి ఉండరు. కానీ ఈ సినిమా అలా ఫ్లాప్ అయ్యేలోపు మేకర్స్ కి తీవ్రమైన నష్టాలు వాటిల్లాయి. థియేట్రికల్ పరంగా ఎలాగో కచ్చితంగా 40 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వస్తాయి. నాన్ థియేట్రికల్ రైట్స్ లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది . సినిమా విడుదలై 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడితే 80 కోట్ల రూపాయిలు, లేదంటే 35 కోట్ల రూపాయల మాత్రమే ఇస్తామని నెట్ ఫ్లిక్స్ సంస్థ మేకర్స్ తో ఒప్పందం చేసుకుందట.
ఆ ఒప్పందం ప్రకారం చూస్తే ‘అఖండ 2’ చిత్రం కేవలం వంద కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. కాబట్టి ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ ద్వారా కేవలం 35 కోట్లు మాత్రమే వస్తుంది. ‘అఖండ 2’ ఫలితం చూసిన తర్వాత బాలయ్య మీద ట్రేడ్ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. బాలయ్య రేంజ్ ఎంత పెద్ద హిట్ అయినా గ్రాస్ 150 కోట్లకు మించదు, షేర్ వంద కోట్లు రావడం కష్టం అని. అందుకే ఆయన గోపీచంద్ మలినేని తో త్వరలోనే చేయబోతున్న సినిమా ఆగిపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట . గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘వీర సింహా రెడ్డి’ అనే చిత్రం వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఇప్పుడు బాలయ్య తో తీయబోయే రెండవ సినిమా కూడా అలా కమర్షియల్ మూవీ అయితే పర్వాలేదు , కానీ చారిత్రిక నేపథ్యం లో తెరకెక్కే సినిమాని మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకున్న రోజే క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 250 కోట్ల రూపాయలకు పైగా ఉందట. అంత బడ్జెట్ బాలయ్య కి పెడితే బూడిదలో పోసిన పన్నీరు అవ్వుద్ది. కచ్చితంగా పాన్ ఇండియా వైడ్ గా మార్కెట్ ఉండాలి, లేదంటే తెలుగు వెర్షన్ నుండి 300 కోట్ల గ్రాస్ ని క్లొళ్ళగొట్టేంత సత్తా ఉండాలి. ఈ రెండు బాలయ్య కి లేవు , ఆయన సినిమా ఎంత పెద్ద హిట్ అయినా 80 నుండి 100 కోట్ల రేంజ్ లో షేర్ వసూళ్లు వస్తాయి. అంతకు మించి రావడం కష్టం. కాబట్టి ఆయన మీద ఈ ప్రాజెక్ట్ వర్క్ అవధాని, ఈ సినిమాని ఆపేయడమే బెటర్ అని నిర్మాతలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న హాట్ టాపిక్. ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి,