Akhanda 2 Thaandavam Lyrical Video: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ లో తెరెక్కిన నాల్గవ చిత్రం ‘అఖండ తాండవం'(Akhanda 2 Movie). 2021 సంవత్సరం లో విడుదలై సంచలనం సృష్టించిన ‘అఖండ’ కి సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రమిది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దసరా కి రావాలని ప్లాన్ చేసుకున్నారు కానీ, అప్పటికీ చాలా వరకు పనులు బ్యాలన్స్ ఉండడం తో డిసెంబర్ కి వాయిదా వేశారు. నార్త్ అమెరికా మరియు ఇతర ఓవర్సీస్ ప్రాంతాల్లో ఈ చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. ట్రెండ్ ఆశించినంత గొప్పగా అయితే లేదు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాట ప్రోమో ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. నేడు కాసేపటి క్రితమే పూర్తి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేశారు.
థమన్ సంగీతం అందించిన ఈ పాటకు శంకర్ మహదేవన్ గాత్రం అందించగా, శంకర్ కొరియోగ్రఫీ చేసాడు. ఇక పాట విషయానికి వస్తే బాలయ్య కి థమన్ ఏ రేంజ్ మ్యూజిక్ ని అందిస్తాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు కూడా అదే రేంజ్ మ్యూజిక్ ని అందిస్తాడని అంతా అనుకున్నారు, కానీ ఎందుకో అఖండ కి సెట్ చేసిన స్టాండర్డ్స్ ని అందుకోలేకపోయాడు అనిపించింది. కాసేపటి క్రితమే విడుదల చేసిన ‘అఖండ తాండవం’ పాట యావరేజ్ గా అనిపించింది. ఆరంభం లో మంచిగానే అనిపించింది కానీ, మధ్యలో ఎందుకో బాగా డౌన్ అయింది అనిపించింది. ఇక విజువల్స్ విషయానికి వస్తే బోయపాటి ఈసారి మాస్ అనే కోణం లో అన్ని హద్దులను చెరిపేయవలని చూసినట్టుగా ఉన్నాడు. బాలయ్య చేతుల్లో మనుషులు బొమ్మలు లాంటి వాళ్ళు అన్నట్టుగా ఈ పాట విజువల్స్ లో చూపించాడు.
ఇది మాస్ ఆడియన్స్ కి, బాలయ్య ఫ్యాన్స్ కి నచ్చవచ్చు కానీ, మిగిలిన ఆడియన్స్ కి మాత్రం ఏంటి ఈ అతి అని అనిపించక తప్పదు. అంతే కాదు ఆ షాట్స్ కూడా చూసేందుకు నేచురల్ గా లేవు, రోప్స్ పెట్టి లాగినట్టు స్పష్టంగా తెలుస్తోంది. మొదటి భాగం లో ‘భమ్..అఖండ’ అనే పాట రాగానే థియేటర్స్ లోని ఆడియన్స్ రోమాలు నిక్కపొడుచుకున్నాయి. కానీ ఈరోజు విడుదల చేసిన పాట లో అలాంటి మ్యాజిక్ మిస్ అయింది. కనీసం థియేటర్స్ లో చూసే ఆడియన్స్ కి అయినా ఈ పాట అద్భుతంగా అనిపిస్తుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రం లో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించింది. అఖండ చిత్రం లో చిన్న పాప ఉంటుంది గుర్తుందా?, ఆమె పెరిగి పెద్ద అయ్యాక సంయుక్త మీనన్ గా మారుతుంది అట. ఆమెకు ఆపద రావడం తో అఖండ కం బ్యాక్ ఇస్తాడు. అక్కడి నుండి సినిమా మొదలు అవుతుందని అంటున్నారు.