Balakrishna Akhanda 2 : నందమూరి నటసింహంగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు (Balayya Babu)…ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపు తీసుకురావడమే కాకుండా మాస్ ప్రేక్షకులను తన వైపు తిప్పుకునేలా చేశాయి. ప్రస్తుతం గాడ్ ఆఫ్ మాసేస్ గా మారిపోయిన ఆయన ఇకమీదట చేయబోయే సినిమాలతో పెను ప్రభంజనాలను సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఆయన ఇప్పుడు ఐదో విజయం కోసం తీవ్రమైన పోరాటమైతే చేస్తున్నాడు…ఇక బాలయ్య బాబు – బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సినిమాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. వాళ్ళ కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చి సూపర్ హిట్స్ గా నిలిచాయి… అఖండ 2 వల్ల కాంబోలో వస్తున్న నాల్గోవ సినిమా కావడంతో ఈ సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుంది అనే ఒక గట్టి నమ్మకంతో బాలయ్య బాబు అభిమానులు గాని, సినిమా లవర్స్ గాని కాన్ఫిడెంట్ తో అయితే ఉన్నారు. మరి వీళ్ళందరి నమ్మకాన్ని నిలబెడుతూ ఈ సినిమా ఎలాంటి పెను ప్రభంజనాలను సృష్టిస్తుందో చూడడానికి సినిమా మేధావులు సైతం సిద్ధమయ్యారు. ఇక సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమా రాబోతుంది అంటూ అనౌన్స్ చేశారు.
నిజానికి ఇంతకుముందే ఈ డేట్ కి పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) హీరోగా సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో వస్తున్న ఓజీ (OG) సినిమా రాబోతుంది అంటూ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇక వాళ్లకు పోటీగా అఖండ 2 సినిమాను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు అంటూ కొంతమంది కొన్ని అభిప్రాయాల్ని వ్యక్తం చేన్నారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్, బాలయ్య బాబు ఇద్దరూ మంచి సన్నిహితులయ్యారు.
కాబట్టి పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) ఓజి(OG) సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. దానివల్ల ఈ రెండు సినిమాలు ఒకేరోజు వస్తే ఇద్దరి సినిమాలకు నష్టం వాటిలో ప్రమాదం ఉంది కాబట్టి అఖండ 2 సినిమా పోస్ట్ పోన్ చేయబోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఓజీ వచ్చిన వారానికి అఖండ 2 సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపించి అభిమానులతో పాటు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని అలరించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…