Balakrishna Akhanda 2: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరో గా నటించిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం రేపు సాయంత్రం ప్రీమియర్ షోస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ చాలా వరకు బయటకు వచ్చింది. కానీ ఒక్కటి కూడా సరిగా పేలలేదు. పాటలు క్లిక్ అవ్వలేదు, ట్రైలర్ అనుకున్నంత రేంజ్ లో పోలేదు, రిలీజ్ ట్రైలర్ కూడా ఫ్యాన్స్ ని అంతంత మాత్రం గానే ఆకట్టుకుంది. ఫలితంగా ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఊహించినంత రేంజ్ లో జరగడం లేదు. ఓవర్సీస్ లో ఇప్పటికే ఈ చిత్రం తేలిపోయింది. ముఖ్యంగా నార్త్ అమెరికా లో అయితే ఈ చిత్రానికి కనీసం మూడు లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో నేడు ఉదయం నుండి ప్రీమియర్ షోస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని ప్రారంభించారు.
ఇక్కడ రెస్పాన్స్ పర్వాలేదు అనే రేంజ్ లో వచ్చింది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం కేవలం ప్రీమియర్ షోస్ నుండి ఈ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ లో రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఓవరాల్ గా రేపు సాయంత్రం ప్రీమియర్ షోస్ మొదలు అయ్యేలోపు కచ్చితంగా 4 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కేవలం ఆంధ్ర ప్రదేశ్ నుండి రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కానీ తెలంగాణ లో ప్రీమియర్ షోస్ ఉంటుందా లేదా అనే విషయం పై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. టికెట్ రేట్స్ జీవో నేడు విడుదల చేస్తారని అంతా అనుకున్నారు కానీ, రేపు మధ్యాహ్నం లోపు జీవో వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే కనుక జరిగితే ఓవరాల్ గా ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ 6 కోట్ల గ్రాస్ కి చేరే అవకాశం ఉంటుంది.
ఇకపోతే బాలయ్య ఈ సినిమా ప్రొమోషన్స్ లో చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. కేవలం తెలుగు వెర్షన్ ప్రొమోషన్స్ మాత్రమే కాదు, హిందీ వెర్షన్ ప్రొమోషన్స్ కూడా దంచి కొట్టేస్తున్నాడు. ఈ సినిమా హిందీ వెర్షన్ కి బాలయ్య స్వయంగా డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. డబ్బింగ్ చెప్పడం లో ఏముంది లే, పేపర్ చూసి చదవడమే కదా అని అనుకుంటే పొరపాటే. బాలయ్య హిందీ ఇంటర్వ్యూస్ లో అనర్గళంగా హిందీ మాట్లాడే తీరు చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. యాంకర్ అడిగే ప్రతీ ప్రశ్నకు గుక్క తిప్పుకోకుండా హిందీ లో నాన్ స్టాప్ గా సమాదానాలు చెప్తూ దుమ్ము దులిపేసాడు. బాలయ్య హిందీ దూకుడు కి కాస్త యాంకర్ కూడా తడబడడం గమనార్హం. సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.