Balagam Heroine Kavya: వరుస విజయాలతో ఊపు మీదుంది కావ్య కళ్యాణ్ రామ్. ఒకప్పటి ఈ చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య నటించిన మసూద, బలగం మంచి విజయాలు సాధించాయి. మసూద చిత్రంలో కావ్య కళ్యాణ్ రామ్ పాత్రకు పెద్దగా నిడివి లేదు. అయితే బలగం మూవీలో మంచి పాత్ర దక్కింది. బలగం 2023 సెన్సేషన్ గా నిలిచింది. దర్శకుడు వేణు ఎల్దండి అద్భుతం చేశాడు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది. ప్రియదర్శి హీరోగా నటించగా ఆయన మరదలి పాత్రలో కావ్య కళ్యాణ్ రామ్ నటించింది. బలగం అంతర్జాతీయ అవార్డులు సైతం కొల్లగొట్టింది.
ఈ క్రమంలో కావ్య కళ్యాణ్ రామ్ కి ఆఫర్స్ పెరుగుతున్నాయి. తాజాగా ఆమె శ్రీసింహ కోడూరికి జంటగా ఉస్తాద్ చిత్రం చేస్తుంది. ఈ ప్రయోగాత్మక చిత్రం విడుదలకు సిద్ధం అవుతుంది. ఇళయరాజా చిన్న కొడుకే ఈ శ్రీసింహ కోడూరి. వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నాడు. ఉస్తాద్ విజయం సాధిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఈ చిత్రానికి ఫణిదీప్ దర్శకుడు.
బలగం చిత్ర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న కావ్య కళ్యాణ్ రామ్ బోల్డ్ కామెంట్స్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి సిద్ధం అన్నారు. మంచి రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తే శృంగార సన్నివేశాల్లో నటించడానికి, స్కిన్ షో చేయడానికి వెనుకాడనని చెప్పింది. కావ్య కళ్యాణ్ రామ్ ఓపెన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పాత్ర డిమాండ్ చేసినప్పుడు నటులు అలాంటి సన్నివేశాల్లో నటించాల్సిందే. కెరీర్ కోసం తప్పదు మరి. కావ్య ఆ విషయాన్ని మొహమాటం లేకుండా చెప్పింది.
కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. అల్లు అర్జున్ డెబ్యూ మూవీ గంగోత్రి లో హీరోయిన్ చిన్నప్పటి పాత్ర చేసింది. అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బాలు మూవీలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. కావ్య అరడజనుకు పైగా చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. మసూద మూవీతో హీరోయిన్ గా మారింది. బలగం ఆమెకు బ్రేక్ ఇచ్చింది. కావ్య ఈ స్థాయికి వెళతారో చూడాలి.