Balagam : ఏ ముహూర్తాన ‘బలగం'(Balagam Movie) సినిమాని మొదలు పెట్టి చేసారో కానీ, సినిమా అయితే పెద్ద హిట్ అయ్యింది కానీ, అందులో నటించే నటీనటులు కొంతమంది అనారోగ్యంతో తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. కొద్దిరోజుల క్రితమే ఈ చిత్రం లో నటించిన మొగులయ్య అనారోగ్యంతో తీవ్రమైన ఇబ్బందులకు గురై చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో బలగం నటుడు కూడా అలాంటి ఆరోగ్య సమస్యతోనే ఇబ్బంది పడుతున్నాడు. ఈ చిత్రం లో హీరో ప్రియదర్శి కి చిన్న తాత అంజన్న పాత్రలో కనిపించిన జీవీ బాబు ఆరోగ్యం విషమించింది. కిడ్నీలు తీవ్రంగా దెబ్బ తినడంతో చాలా రోజుల నుండి డయాలిసిస్ చేయించుకుంటున్నాడు. ఇప్పుడు అతని వద్ద ఉన్న డబ్బులు మొత్తం అయిపోవడం తో మందులు కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. జీవీ బాబు పరిస్థితి ని తెలుసుకొని బలగం దర్శకుడు వేణు, హీరో ప్రియదర్శి ఆర్తి సాయం అందించారు.
Also Read : జబర్దస్త్ ట్యాగ్ నాకొద్దు, ఎన్టీఆర్ మూవీలో ఆ సీన్ నాదే.. సంచలనంగా బలగం వేణు కామెంట్స్
కానీ అవి ఆయన ఆరోగ్యం మెరుగుపడుటకు ఏ మాత్రం సరిపోలేదు. అతని విషయం తెలుసుకున్న వాళ్ళు ఎదో ఒక రూపం లో ఆర్ధిక సాయం చేస్తూనే ఉన్నారు కానీ, ఆ డబ్బులు పాపం ఆయన ఆరోగ్య పరిస్థితి ని మెరుగుపర్చడానికి సరిపోవడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ఆదుకోవాలని మీడియా ముందుకొచ్చి ప్రాధేయపడుతున్నారు. ఈ విషయం దిల్ రాజు వరకు చేరితే కచ్చితంగా ఆయన కూడా సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంటుందని అంటున్నారు నెటిజెన్స్. డైరెక్టర్, హీరో వరకు వెళ్లిన ఈ అంశం దిల్ రాజు వరకు వెళ్లకుండా ఉంటుందా?, కచ్చితంగా ఆయనకు ఈ సమాచారం తెలిసే ఉంటుంది. కానీ ఆయన సహాయం చేయడం లేదని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు. కనీసం మీరైనా సహాయం చేయండి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని, ప్రభుత్వ పెద్దలను ట్యాగ్ చేసి నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : దర్శకులు నాపై బాడీ షేమింగ్ కి పాల్పడ్డారు… బలగం హీరోయిన్ కావ్య సీరియస్ ఆరోపణలు
మరి జీవీ బాబు కి తగిన ఆర్ధిక సాయం అందుతుందో లేదో చూడాలి. ఇకపోతే బలగం వేణు అతి త్వరలోనే ‘ఎల్లమ్మ’ చిత్రాన్ని ప్రారంభించబోతున్నాడు. ఇందులో హీరోగా నితిన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరుని పరిలశీలిస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి అయ్యింది. వచ్చే నెల లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా డైరెక్టర్ వేణు జీవీ బాబు, మొగులయ్య లాంటి కళాకారులను మరికొంతమందిని ఇండస్ట్రీ పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాడట. ఆయన స్ఫూర్తి ని కచ్చితంగా మెచ్చుకోవలసిందే. కానీ మంచి పాత్రలు రాసి, కెరీర్ లో ఆ నటీనటులు స్థిరపడేలా చేస్తే బాగుంటుందని అందరూ అంటున్నారు. మరో కళాకారుడు ఇలా వైద్యనికి కూడా ఆర్ధిక స్తొమత సరిపోలేనంతగా ఇబ్బంది పరిస్థితులు రాకూడదని అంటున్నారు.