spot_img
Homeఎంటర్టైన్మెంట్అరుదైన ఘనత సాధించిన బాలయ్య "అన్ స్టాపబుల్ షో"... ఖుషీలో ఫ్యాన్స్ ?

అరుదైన ఘనత సాధించిన బాలయ్య “అన్ స్టాపబుల్ షో”… ఖుషీలో ఫ్యాన్స్ ?

Unstoppable Show: ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా ప్రసారమవుతోన్న అన్‌స్టాపబుల్‌ టాక్‌షో ఏ రేంజ్‌లో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోకు మంచి బజ్‌ ఏర్పడింది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే బాలయ్య తొలిసారి యాంకర్‌గా మారి తోటి తారలను ఇంటర్వ్యూ చేసే విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. బాలకృష్ణ తన హోస్టింగ్ నైపుణ్యంతో తెలుగు ప్రేక్షకులను, అభిమానులను ఆశ్చర్యపరిచారు.

bala krishna unstoppable talk show got 5th place in imdb rankings

ఆయన హోస్టుగా మారినప్పటి నుంచి హాస్యంతో పాటు తన తోటి నటీనటులతో మెలుగుతున్న తీరు అన్ని వర్గాల ప్రేక్షకులను, అందరు హీరోల అభిమానులనూ మెప్పిస్తోంది. తొలి సీజన్‌లో భాగంగా మొత్తం 10 ఎపిసోడ్‌లు ముగిశాయి. సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో నిర్వహించిన షోతో తొలి సీజన్‌ను ముగించారు మేకర్స్‌. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎపిసోడ్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య అన్‌స్టాపబుల్‌ టాక్‌షో అరుదైన ఘనతను సాధించింది.

ఐఎండిబి లోని టాప్ 10 రియాలిటీ టీవీ జాబితాలో స్థానం దక్కించుకుంది. ఒక తెలుగు టాక్‌ షోకి ఇలాంటి గౌరవం లభించడం బహుశా ఇదే తొలిసారి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. ఎపిసోడ్‌, ఎపిసోడ్‌కు టాప్‌ రేటింగ్స్‌తో దూసుకుపోతున్న అన్‌స్టాపబుల్‌ షో ఐఎండిబి జాబితాలో 5వ స్థానం పొందింది. దీంతో సెకండ్ సీజన్‌పై మరింత ఆసక్తి నెలకొంది. తొలి సీజన్‌కు మంచి టాక్‌ రావడంతో రెండో సీజన్‌ను వీలైనంత త్వరగా లైన్‌లో పెట్టాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు పమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Akhil Akkineni

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...
Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...
Today 25 July 2026 Horoscope:

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Oktelugu Epaper