https://oktelugu.com/

Bala Krishna : అఖండ 2′ చిత్రం కోసం భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న బాలయ్య..ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

బాలయ్య చిన్న కూతురు తేజస్విని క్లాప్ కొత్తగా, అఖండ 2 లోని డైలాగ్ ని బాలయ్య చెప్పుకొచ్చాడు. అది సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కోసం బాలయ్య బాబు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 16, 2024 / 09:52 PM IST

    Bala Krishna

    Follow us on

    Bala Krishna :  టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బోయపాటి శ్రీను మిగిలిన హీరోలతో సినిమాలు తీసినప్పుడు సక్సెస్ అవుతాడో లేదో చెప్పలేము కానీ, బాలయ్య తో సినిమా అంటే మాత్రం ఆయన ఇండస్ట్రీ ని షేక్ చేసే కథతోనే వస్తాడు. సింహా, లెజెండ్, అఖండ ఇలా వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ప్రతీ సినిమా ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్ అవుతూ వచ్చాయి. ముఖ్యంగా అఖండ చిత్రం విజయం గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. అతి తక్కువ టికెట్ రేట్స్ తో విడుదలైన ఈ చిత్రం 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. అప్పట్లోనే 70 కోట్ల రూపాయిలు అంటే, ఇప్పటి టికెట్ రేట్స్ ని బట్టి ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

    ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ ‘అఖండ 2 ‘ తో మన ముందుకు రాబోతుంది. నేడు ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు అట్టహాసం గా మొదలైంది. బాలయ్య చిన్న కూతురు తేజస్విని క్లాప్ కొత్తగా, అఖండ 2 లోని డైలాగ్ ని బాలయ్య చెప్పుకొచ్చాడు. అది సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కోసం బాలయ్య బాబు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమా కోసం ఆయన ఏకంగా 40 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. రామ్ ఆచంట నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి బాలయ్య చిన్న కూతురు తేజస్విని కూడా సహనిర్మాతగా వ్యవహరిస్తోంది. బాలయ్య మార్కెట్ బాగా పెరగడం తో పాటు, ఇప్పుడు ఆయన సినిమాకు అవలీలగా వంద కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉన్నందున బాలయ్య అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు ఏ నిర్మాత కూడా వెనకాడడం లేదు. దానికి తోడు ఈమధ్య కాలం డిజిటల్, సాటిలైట్ రైట్స్ భారీ ఎత్తున ఫ్యాన్సీ రేట్లకు అమ్ముడుపోతున్నాయి.

    నాని స్థాయి మీడియం రేంజ్ హీరోలు కూడా ఈమధ్య 20 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నారు. ఇక బాలయ్య స్థాయి హీరోలు 40 కోట్లు డిమాండ్ చేయడం లో తప్పే లేదు. పైగా ‘అఖండ 2’ చిత్రానికి నేటి తరం స్టార్ హీరోలతో సమానంగా పాన్ ఇండియా లెవెల్ లో భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. అందుకే నిర్మాతలు 40 కోట్లు ఇచ్చేందుకు వెనకాడడం లేదు. ప్రస్తుతం బాలయ్య బాబు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో బాబీ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బాలయ్య 30 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడు. ఈ చిత్రానికి ముందు విడుదలైన ‘భగవంత్ కేసరి’ కి బాలయ్య దాదాపుగా 18 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నాడు.