https://oktelugu.com/

Bala Krishna: బాలయ్య 107వ సినిమాకి ముహూర్తం ఫిక్స్ చేసిన చిత్ర బృందం…

Bala Krishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ఒక వైపు  సినిమాలు మరో వైపు ఆహా ఓటీటీ వేదికగా బాలయ్య ఓ టాక్​ షో చేస్తున్న సంగతి తెలిసిందే. అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే పేరుతో నడుస్తున్న ఈ షోకు బాలకృష్ణ హోస్ట్​గా వ్యవహరిస్తున్నారు. బాలయ్య  107 వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమాను కంప్లీట్ చేసిన బాలయ్య… ఇప్పుడు గోపి చంద్ తో మూవీ […]

Written By: , Updated On : November 10, 2021 / 07:17 PM IST
Follow us on

Bala Krishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ఒక వైపు  సినిమాలు మరో వైపు ఆహా ఓటీటీ వేదికగా బాలయ్య ఓ టాక్​ షో చేస్తున్న సంగతి తెలిసిందే. అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే పేరుతో నడుస్తున్న ఈ షోకు బాలకృష్ణ హోస్ట్​గా వ్యవహరిస్తున్నారు. బాలయ్య  107 వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమాను కంప్లీట్ చేసిన బాలయ్య… ఇప్పుడు గోపి చంద్ తో మూవీ కి సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది.
bala krishna and gopichand malineni movie muhurtham date fixed
వీరి కాంబోలో చేయనున్న సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సింహ,  లెజెండ్ చిత్రాలు ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాలని బాలయ్య అభిమానులు కోరుకుంటున్నారు.  అయితే ఇప్పుడు తాజాగా గోపిచంద్ తో చేయబోయే సినిమా గురించి ఓ ఆసక్తికర అప్డేట్ ను ప్రకటించింది చిత్ర బృందం.

కాగా బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 13వ తారీఖున ఉదయం 10.26 గంటలకు సినిమాను ప్రారంభిస్తున్నట్లు నిర్మాతలు నవీన్ ఏర్నేటి, వై రవిశంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా వదిలింది మూవీ యూనిట్. ఇక ఈ అప్ డేట్ తో బాలయ్య ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.ఈ సినిమాను  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో హీరోయిన్ గా శృతి హాసన్ ని ఎంపిక చేశారు.