Harish Rao: హరీష్ కు వైద్యఆరోగ్యశాఖ,, కేసీఆర్ సరికొత్త వ్యూహం అదేనా?

Harish Rao: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని భావిస్తుంటారు. రాజకీయ నాయకులైతే మరీను ప్రతి అవకాశాన్ని పావుగా వాడుకుంటారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ తన కొడుకును సీఎం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన పదవీ ముహూర్తానికి ఎప్పుడు సమయం రావడం లేదు. దీంతో కొన్నాళ్లుగా తండ్రి కొడుకులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ వేడుక పూర్తిచేయాలని చూస్తున్నారు. దీని కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయినా సమయం కలిసి రావడం లేదు. ఫలితంగానే గత కొద్ది రోజులుగా […]

Written By: Neelambaram, Updated On : November 10, 2021 7:08 pm
Follow us on

Harish Rao: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని భావిస్తుంటారు. రాజకీయ నాయకులైతే మరీను ప్రతి అవకాశాన్ని పావుగా వాడుకుంటారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ తన కొడుకును సీఎం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన పదవీ ముహూర్తానికి ఎప్పుడు సమయం రావడం లేదు. దీంతో కొన్నాళ్లుగా తండ్రి కొడుకులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ వేడుక పూర్తిచేయాలని చూస్తున్నారు. దీని కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయినా సమయం కలిసి రావడం లేదు. ఫలితంగానే గత కొద్ది రోజులుగా ఈ మేరకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక బాధ్యతలను కేటీఆర్ కు అప్పగిస్తారని మొదట భావించారు. కానీ ఏ మాత్రం సంబంధం లేని విధంగా మంత్రి హరీశ్ రావు చేతిలో పెట్టారు. కానీ అప్పుడే అందరిలో అనుమానాలు వచ్చాయి. అక్కడ టీఆర్ఎస్ ఖచ్చితంగా ఓటమి ఖాయమనే పుకార్లు షికార్లు చేశాయి. దానికి అనుగుణంగా ఫలితం కూడా అలాగే వచ్చింది. దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో ఫలితాలు ముందే ఊహించి హరీశ్ కు బాధ్యతలు అప్పగించి తన బాధ్యతలను తగ్గించాలని ప్రయత్నించినట్లు ప్రచారం సాగింది.

ప్రస్తుతం హరీశ్ రావుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించడం సంచలనం సృష్టిస్తోంది. ఇన్నాళ్లు హరీశ్ రావు బాధ్యతలు తప్పిస్తారని భావించినా ఆయన స్థాయిని పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వెనుక అందరిలో అనుమానాలు వస్తున్నాయి. దీంతో కేసీఆర్ వ్యూహం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నలు వస్తున్నాయి. కానీ ఏదో ఆశించి కేసీఆర్ హరీశ్ రావు స్థాయిని పెంచినట్లు తెలుస్తోంది.

Also Read: Telangana: అన్న‌దాత‌ను ఆగం చేస్తున్న ఆ రెండు పార్టీలు..

ఇప్పుడు కేటీఆర్ ను సీఎంగా చేయాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ముందస్తు వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేటీఆర్ ను సీఎం చేయాలనే ఉద్దేశంతోనే సీఎం సీరియస్ గా ప్రయత్నిస్తున్నల్లు సమాచారం. ఇందులో భాగంగానే కేటీఆర్ సీఎం చేయడానికి పలు కోణాల్లో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి సీఎం గా కేటీఆర్ ను చేయాలనే కల ఏనాటికి తీరనుందో అని అందరిలో సందేహాలు వస్తున్నాయి.

Also Read: Kaushik Reddy: కౌశిక్ రెడ్డి రాకతోనే టీఆర్ఎస్ కు నష్టం కలిగిందా?

Tags