https://oktelugu.com/

Jani Master: బిగ్ బ్రేకింగ్ : జానీ మాస్టర్ కి బెయిల్ మంజూరు.. త్వరలోనే ఆధారాలతో ప్రెస్ మీట్ ఏర్పాటు..?

కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా వ్యవహరించేవాడు. ఇప్పుడు ఆ పదవి నుండి కూడా తప్పించారు. అరెస్ట్ కాకముందు జానీ మాస్టర్ 12 సినిమాలకు కొరియోగ్రఫీ చేయడానికి ఒప్పుకున్నాడు, అందులో టాలీవుడ్ సినిమాలతో పాటు, బాలీవుడ్ కోలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ ఇప్పుడు జానీ మాస్టర్ తో చేయిస్తారా?, ఆయనకు కేవలం నాలుగు రోజులు మాత్రమే బెయిల్ ఇచ్చారు, ఆ తర్వాత బెయిల్ ని పొడిగిస్తారో, లేకపోతే మళ్ళీ అరెస్ట్ చేస్తారో తెలియదు.

Written By:
  • Vicky
  • , Updated On : October 3, 2024 / 12:18 PM IST

    Jani Master(3)

    Follow us on

    Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఆయన చంచల్ గూడా జైలులో రిమాండ్ లో ఉన్నాడు. కోర్టు అనుమతితో పోలీసులు ఆయన్ని కస్టడీ లోకి తీసుకొని విచారణ కూడా చేపట్టారు. అయితే ఈ కేసు విషయం లో జానీ మాస్టర్ కి సంబంధించిన న్యాయవాది బెయిల్ కోసం దరఖాస్తు చేసాడు. ఈ పిటీషన్ ని పరిశీలించిన కోర్టు జానీ మాస్టర్ కి ఈ నెల 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జానీ మాస్టర్ ఈ నెల 6వ తేదీన బెయిల్ మీద బయటకి విడుదల కానున్నాడు. కోర్టు ఆయనకు ఎలాంటి ఆంక్షలు విధించిందో తెలియదు కానీ, ఆయన మీడియా ముందుకు వచ్చి తన పై జరిగిన ఆరోపణలకు వివరణ ఇస్తాడని ఆయన మద్దతుదారులు కోరుకుంటున్నారు. జానీ మాస్టర్ పై ఇలాంటి సంచలన ఆరోపణలతో కేసు నమోదు అవ్వడం వల్ల జనసేన పార్టీ ఆయన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.

    అలాగే ఆయన కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా వ్యవహరించేవాడు. ఇప్పుడు ఆ పదవి నుండి కూడా తప్పించారు. అరెస్ట్ కాకముందు జానీ మాస్టర్ 12 సినిమాలకు కొరియోగ్రఫీ చేయడానికి ఒప్పుకున్నాడు, అందులో టాలీవుడ్ సినిమాలతో పాటు, బాలీవుడ్ కోలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ ఇప్పుడు జానీ మాస్టర్ తో చేయిస్తారా?, ఆయనకు కేవలం నాలుగు రోజులు మాత్రమే బెయిల్ ఇచ్చారు, ఆ తర్వాత బెయిల్ ని పొడిగిస్తారో, లేకపోతే మళ్ళీ అరెస్ట్ చేస్తారో తెలియదు. ఇలాంటి సమయంలో ఆయన ఒప్పుకున్నా చిత్రాలు పూర్తి చేయడం కష్టమే. కాబట్టి ఈ 12 సినిమాలు తన చేతి నుండి జారిపోయినట్టే. అంతే కాకుండా జానీ మాస్టర్ నిర్దోషి అని తేలేంత వరకు ఆయనతో సినిమాలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రారు. కాబట్టి తనని తానూ నిరూపించుకోవడానికి, ఏ తప్పు చేయలేదు అని చెప్పడానికి జానీ మాస్టర్ తదుపరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో చూడాలి.

    అయితే జానీ మాస్టర్ రిమాండ్ లో ఉన్నాడు కాబట్టే బెయిల్ వచ్చింది. కేసు నిజమని నిర్ధారణ అయితే ఆయనకు 10 ఏళ్ళు నాన్ బైలబుల్ శిక్ష పడుతుంది. పోస్కో చట్టం చాలా కఠినంగా ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే జానీ మాస్టర్ కి బెయిల్ ఇప్పించడానికి ఇండస్ట్రీ లో ఉన్న ఒక ప్రముఖ ఫ్యామిలీ చాలా కష్టపడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేయలేదని బలంగా నమ్ముతున్నారు. అలా ఆయనకీ బెయిల్ వచ్చేలా చేసింది ఎవరో కాదు, నాగ బాబు అని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇండస్ట్రీ వైపు నుండి మొట్టమొదటగా పరోక్షంగా సపోర్ట్ చేసింది నాగబాబు మాత్రమే. ఆ తర్వాత కొంతమంది జానీ మాస్టర్ మంచోడు, అలాంటి పనులు చేయడు అంటూ ట్వీట్లు వేశారు.