Homeఎంటర్టైన్మెంట్Prabhas: ‘బాహుబలి’ ప్రభాస్ మరో రికార్డు.. ఆసియాలో నెంబర్ వన్..!

Prabhas: ‘బాహుబలి’ ప్రభాస్ మరో రికార్డు.. ఆసియాలో నెంబర్ వన్..!

Prabhas:  ‘బాహుబలి’ సిరీసులతో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 2021 దక్షిణాసియాలోని టాప్ 50మంది ప్రముఖుల జాబితాను బ్రిటన్ కు చెందిన ఈస్టర్న్ ఐ వీక్లీ ఇటీవల విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రభాస్ నెంబర్ స్థానాన్ని దక్కించుకొని అరుదైన రికార్డును సొంతం చేసుకోవడంపై డార్లింగ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

actor prabhas got first place in asian top celebraties list

‘సెలబ్రెటీస్ ఇన్ ది వరల్డ్’ పేరిట బ్రిటన్ కు చెందిన ఈస్టర్న్ ఐ వీక్లీ ప్రతీయేటా సినిమా, టీవీ, సాహిత్యం, సంగీతం, తదితర రంగాలకు చెందిన ప్రముఖుల జాబితాను విడుదల చేస్తోంది. ఈక్రమంలోనే 2021 సంవత్సరానికి సంబంధించిన దక్షిణాసియాలోని 50మంది ప్రముఖులతో కూడిన జాబితాను ఆ సంస్థ ఇటీవల విడుదల చేసింది.  ఎంతోమంది గ్లోబల్ స్టార్స్ ను వెనక్కి నెట్టి ప్రభాస్ ఈ జాబితాలో నెంబర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.

ఈ జాబితాలో బ్రిటిష్ పాకిస్థానీ నటుడు రియాజ్ అహ్మద్ ఈ జాబితాలో రెండోస్థానంలో, ప్రియాంక చొప్రా మూడో స్థానం, ఇండియన్ అమెరికన్ మిండీ కాలింగ్ నాలుగో స్థానం, ప్రముఖ సింగర్ శ్రేయా గోషల్ ఐదో స్థానంలో నిలిచారు. అలాగే ఈ లిస్టులో బ్యూటీఫుల్ హీరోయిన్ సమంత 20వ స్థానంలో, మెగా పవర్ స్టార్ రాంచరణ్ 32 స్థానంలో నిలిచినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’  విడుదలకు రెడీగా ఉంది. కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడగా త్వరలోనే కొత్త రిలీజ్ ను డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభాస్ ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘స్పిరిట్’ వంటి చిత్రాల్లో నటిస్తూ బీజీగా ఉన్నాడు. అలాగే సమంత పలు బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలు చేస్తూ బీజీగా హీరోయిన్ గా మారిపోయింది. ఇటీవలే ‘పుష్ప’లో సమంత స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టింది.

ప్రస్తుతం ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాంకుతలం’లో నటిస్తోంది. అలాగే మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ ఓ మూవీ చేస్తున్నాడు. ఈమూవీలో చరణ్ కు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ కియారా అడ్వాణీ నటిస్తోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version