Bahubali Movie : తెలుగు చలన చిత్ర పరిశ్రమ దశ దిశాని మార్చేసిన చిత్రం ‘బాహుబలి’. ఆరోజులలో రాజమౌళి(SS Rajamouli) ‘మగధీర’ చిత్రాన్ని ఎంతో రిస్క్ చేసి భారీ బడ్జెట్ తో తీసాడు. ఆ చిత్రం తెలుగు చలన చిత్ర పరిశ్రమని షేక్ చేసింది. రాజమౌళి అప్పట్లో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయమని నిర్మాత అల్లు అరవింద్ ని బ్రతిమిలాడాడు. కానీ ఆయన ఇతర భాషల్లో రిలీజ్ చేయడానికి ఒప్పుకోలేదు. ఒకవేళ ఈ సినిమాని అప్పట్లోనే హిందీ లో రిలీజ్ చేసి ఉండుంటే, బాహుబలి సమయంలో మన టాలీవుడ్ కి వచ్చిన గుర్తింపు, ఆరోజుల్లోనే వచ్చేది. అయితే ఎట్టకేలకు తనకు ఎలాంటి లిమిట్స్ పెట్టని నిర్మాత దొరకడంతో ‘బాహుబలి'(Bahubali Movie) చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించాడు రాజమౌళి. అలా భారీ అంచనాల నడుమ అన్ని భాషల్లో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా ఒక సునామీని సృష్టించింది.
Aslo Read ;రాజమౌళి ఫ్యామిలీ తో నాని కి అంత మంచి బాండింగ్ ఉండటానికి అదొక్కటే కారణమా..?
మొదటి నుండి నార్త్ ఇండియా లో మన తెలుగు సినిమా అంటే చిన్న చూపు ఉండేది. అలాంటి ఇండస్ట్రీ లో అప్పట్లోనే 140 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టి, సంచలనం సృష్టించింది. హీరో ప్రభాస్(Rebel Star Prabhas), రాజమౌళి పేర్లు నార్త్ ఇండియా లో మారు మోగిపోయాయి. ఆరోజుల్లోనే దాదాపుగా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 586 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక సీక్వెల్ కి ఏ రేంజ్ వసూళ్లు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది సీక్వెల్. నిన్న మొన్నటి వరకు కూడా ఈ సీక్వెల్ నే ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. టీవీ టెలికాస్ట్ లో కూడా బాహుబలి చిత్రం ఒక ప్రభంజనం. అలాంటి చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నట్టు ఆ చిత్ర నిర్మాతలు కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేశారు.
ఈ సినిమా విడుదలై అక్టోబర్ నాటికి సరిగ్గా పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా మేకర్స్ ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. రీ రిలీజ్ కి కూడా కనీవినీ ఎరుగని రేంజ్ లో ప్రొమోషన్స్ చేయబోతున్నారట. నాలుగు నెలలకు ముందే అధికారిక ప్రకటన చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు, ప్లానింగ్ ఏ రేంజ్ లో ఉంది అనేది. ఇప్పటి వరకు రీ రిలీజ్ చరిత్ర లో 32 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం నెంబర్ 1 చిత్రం గా విజయ్ గిల్లీ చిత్రం నిల్చింది. బాహుబలి చిత్రం రీ రిలీజ్ మూవీస్ లలో వంద కోట్ల గ్రాస్ ని రాబట్టిన చిత్రం గా నిలుస్తుందా లేదా అనేది ఇప్పుడు చర్చకు వచ్చింది. అదే కనుక జరిగితే రీ రిలీజ్ సినిమాలకు కూడా ఇక నాన్ బాహుబలి రికార్డు అనే క్యాటగిరీ ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది.