Homeఎంటర్టైన్మెంట్Badri movie 26 years anniversary: 'బద్రి' చిత్రానికి 26 ఏళ్ళు.. హీరోయిజానికి సరికొత్త నిర్వచనం..ఆరోజుల్లో...

Badri movie 26 years anniversary: ‘బద్రి’ చిత్రానికి 26 ఏళ్ళు.. హీరోయిజానికి సరికొత్త నిర్వచనం..ఆరోజుల్లో ఎంత వసూళ్లను రాబట్టిందంటే..

Badri movie 26 years anniversary: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ కి నాంది పలికిన చిత్రం ‘బద్రి’. ఈ సినిమా ద్వారానే పూరి జగన్నాథ్ మన టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. అంటే డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ 26 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు అన్నమాట. ఈ సినిమా ముందు ఇలాంటి టైపు యాటిట్యూడ్ , హీరోయిజం ఉన్న సినిమాలను మన ఆడియన్స్ […]

Badri movie 26 years anniversary: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ కి నాంది పలికిన చిత్రం ‘బద్రి’. ఈ సినిమా ద్వారానే పూరి జగన్నాథ్ మన టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. అంటే డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ 26 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు అన్నమాట. ఈ సినిమా ముందు ఇలాంటి టైపు యాటిట్యూడ్ , హీరోయిజం ఉన్న సినిమాలను మన ఆడియన్స్ చూడలేదు. ఇప్పటి జెన్ జీ ఆడియన్స్ కి యానిమల్ , అర్జున్ రెడ్డి వంటి సినిమాలు తోపు యాటిట్యూడ్ తో కూడినవి గా అనిపించొచ్చు. కానీ ఇలాంటి యాటిట్యూడ్ తో 26 ఏళ్ళ క్రితమే పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ తో చేసి చూపించాడు. అప్పటి తరానికి ఇలాంటి హీరోయిజం కొత్త కాబట్టి , మొదట్లో ఈ సినిమాకు డిజాస్టర్ ఫ్లాప్ టాక్ వచ్చింది.

వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న పవర్ స్టార్ కెరీర్ ‘బద్రి’ చిత్రం బ్రేకులు వేసింది అంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు , స్వీట్లు పంచుకున్నారు , కేక్స్ ని కూడా కట్ చేశారు. కానీ రెండవ రోజు నుండి ఈ సినిమా సృష్టించిన సునామీ ని చూసి అప్పట్లో అందరూ నోరెళ్లబెట్టారు. ఒక్క సెంటర్ లో నెల రోజులకు పైగా, ప్రతీ రోజు నాలుగు ఆటలు హౌస్ ఫుల్స్ తో నడిచాయి. కొన్ని సెంటర్స్ లో అయితే 50 రోజులకు పైగా హౌస్ ఫుల్స్ నమోదు అయ్యేవి. ముఖ్యంగా నైజాం ప్రాంతం లో ఈ చిత్రం ఒక ప్రభంజనం అనే చెప్పాలి. ఆ ప్రాంతం లో అత్యధిక సార్లు రీ రిలీజ్ అయిన చిత్రం ఇదే. రీ రిలీజ్ అయిన ప్రతీ సారీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ నెలకొల్పేది ఈ చిత్రం. యూత్ ఆడియన్స్ ఆ రేంజ్ లో బ్రహ్మరధం పట్టారు ఈ చిత్రానికి.

ఇకపోతే ఆ రోజుల్లోనే ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద 14 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. అంటే దాదాపుగా ఇండస్ట్రీ హిట్ రేంజ్ వసూళ్లు అన్నమాట. కేవలం రాయలసీమ ప్రాంతం లో మాత్రమే ఈ సినిమాకు అనుకున్నంత వసూళ్లు రాలేదు. అక్కడ కూడా భారీ వసూళ్లు నమోదు అయ్యుంటే , ఈ చిత్రం కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచేది అని ట్రేడ్ విశ్లేషకుల వాదన. ఆరోజుల్లోనే 58 డైరెక్ట్ సెంటర్స్ లో 50 రోజులు , 39 డైరెక్ట్ సెంటర్స్ లో 100 రోజులు పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఒక్క ఉత్తరాంధ్ర ప్రాంతం నుండే 8 సెంటర్స్ లో 100 రోజులు పూర్తి చేసుకొని అప్పట్లో ఈ చిత్రం సంచలనం సృష్టించింది. కొన్ని సెంటర్స్ లో 125 నుండి 175 రోజుల వరకు ఆడింది. అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ రీ రిలీజ్ కి ప్రస్తుతం వేరే లెవెల్ డిమాండ్ ఉందని చెప్పొచ్చు. ఒక్క నైజాం ప్రాంతం లోనే రీ రిలీజ్ రైట్స్ కోటి రూపాయలకు పైగా అమ్ముడుపోయింది అంటే ఈ చిత్రానికి ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper