
‘సూపర్ స్టార్ మహేష్ బాబు’కు తన తండ్రి కృష్ణ పుట్టిన రోజున తన సినిమాకి సంబంధించి టీజర్ నో, ట్రైలర్ నో రిలీజ్ చేయడం మహేష్ కి ఆనవాయితీగా వస్తోంది. ఐతే, మే 31న కృష్ణ పుట్టిన రోజు. ప్రస్తుతం లాక్ డౌన్ ఉన్నా.. మహేష్ ఇష్టాన్ని కాదనలేక ‘సర్కారు వారి పాట’ టీమ్ ఈ సినిమా నుండి టీజర్ ను రెడీ చేయడానికి సన్నాహాలు చేస్తోందని వార్తలు వచ్చాయి.
అయితే, తాజాగా దీనికి సంబంధించి అప్ డేట్ ఇచ్చారు మహేష్ టీమ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు రీత్యా మహేష్ బాబు తదుపరి సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదని మహేష్ టీమ్ తాజాగా ట్వీట్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. అయితే, మహేష్ అభిమానులు ఈ ట్వీట్ తో కాసింత నిరాశ చెందారు. మొత్తానికి సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డేకు సర్కారి వారి పాట నుండి ఇక ఎలాంటి అప్ డేట్ రానట్లే.
నిజానికి ఇప్పటివరకూ షూట్ చేసిన సీన్స్ లో టీజర్ ను కట్ చేసేంత ఫుటేజ్ లేకపోవడం వల్లే ఈ సినిమా నుండి ఎలాంటి అప్ డేట్ రిలీజ్ చేయలేకపోయారు. దుబాయ్ లో జరిగిన 15 రోజుల షెడ్యూల్ లో కేవలం ఒకే ఒక్క యాక్షన్ సీక్వెన్స్ ను మాత్రమే తెరకెక్కించడం వల్లే టీజర్ కట్ చేసే షాట్స్ ఆ సీక్వెన్స్ లో ఎక్కువ లేవని పరుశురామ్ మహేష్ కి చెప్పాడు.
అయితే ఓ దశలో పరుశురామ్ 30 సెకన్ల గ్లింప్స్‌ని కట్ చేసి, ఫ్యాన్స్ కోసం ఒక పవర్ డైలాగ్ ను మిక్స్ చేసి రిలీజ్ చేద్దామని చూశారు. కాకపోతే మహేష్ కి ఆ 30 సెకన్స్ గ్లింప్స్ నచ్చలేదు. దాంతో మహేష్ ఈ గ్లింప్స్ ను వద్దు అన్నాడు. సో.. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న మహేష్ ఎలాంటి సర్ ప్రైజ్ ఇవ్వట్లేదు.