Kalki 2898 Release Postponed: ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD మీద భారీ అంచనాలే ఉన్నాయి.కల్కి టీజర్ చూసిన ఆడియన్స్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రతి ఫ్రేమ్ కూడా చాలా యూనిక్ గా ఉండటమే కాకుండా మరో ప్రపంచం లోకి తీసుకుని వెళ్తుంది. గ్రాఫిక్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, కాస్ట్యూమ్స్ కావచ్చు ప్రతీతి కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉందనే చెప్పాలి. ఇక ఈ సినిమాను 2024 లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది కానీ రిలీజ్ తేదీ మాత్రం కన్ఫామ్ చేయలేదు.
తాజాగా రిలీజ్ తేదీ విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చినట్లు తెలుస్తుంది. నిజానికి ఈ సినిమాను 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు, కానీ అనుకున్న తేదీకి సినిమా రావడం కష్టమే అని తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో గ్రాఫిక్స్ కు పెద్ద పీట వేశారు. ఇప్పటికే దాదాపు 75% సినిమా షూటింగ్ పూర్తి అయిన కానీ VFX వర్క్ భారీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
హాలీవుడ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో అవుట్ ఫుట్ లో ఎక్కడ కూడా రాజీ పడకుండా పర్ఫెక్ట్ గా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో టాప్ 5 కంపెనీ లు ఈ ప్రాజెక్ట్ VFX వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖర్చు కూడా దానికి తగ్గట్లే ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో దాదాపు 400 నుంచి 500 కోట్లు వరకు గ్రాఫిక్స్ కోసమే కేటాయించినట్లు తెలుస్తోంది. 200 కోట్లు దాకా రెమ్యూనరేషన్స్ మరో 200 కోట్లు షూటింగ్ కి ఖర్చు పెడుతున్నట్టు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది.. ఈ కోణంలో చూసుకుంటే ఇండియా లోనే అతి పెద్ద ప్రాజెక్ట్ ఇదే అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
ఇక తాజాగా వినిపిస్తున్న న్యూస్ ఏమిటంటే ఈ సినిమా వచ్చే ఏడాది మే 9 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాగూ సమ్మర్ హాలీడేస్ కలిసివస్తాయి. ఆ టైం కి సినిమా కూడా పూర్తి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆ తేదీని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికి వస్తున్నా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం సినీ ప్రేమికులు మరో 10 నెలలు ఎదురు చూడగా తప్పదు.