Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలితో ఉన్నారు. బాహుబలి 2 తర్వాత వాళ్ళను పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచే చిత్రం ప్రభాస్ నుండి రాలేదు. సాహో కొంతలో కొంత పర్లేదు. రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు తీవ్ర నిరాశకు గురి చేశాయి. చెప్పాలంటే ప్రభాస్ కి హ్యాట్రిక్ ప్లాప్స్ పడ్డాయి. నిస్పృహలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక హిట్ కావాలి. ప్రభాస్ ని సలార్ హిట్ ట్రాక్ ఎక్కిస్తుందని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. కెజిఎఫ్ సిరీస్ తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ నుండి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే ఫ్యాన్స్ నిరాశ చెందే ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రభాస్ ఎంట్రీకి సంబంధించిన ఈ పుకారు ఆందోళనకు గురి చేస్తుంది. అదేమిటంటే… సినిమా మొదలైన 40 నిమిషాల వరకు ప్రభాస్ కనిపించరట. ప్రభాస్ ప్రీ ఇంటర్వెల్ కి ముందు వస్తారట. అప్పటి వరకు పృథ్విరాజ్ మీదే కథ నడుస్తుందట. పాత్రల పరిచయం, స్టోరీ సెటప్ కే ప్రశాంత్ నీల్ అంత సమయం తీసుకున్నాడట.
ఐదు లేదా పది నిమిషాలు అంటే ఓకే. దాదాపు ప్రభాస్ ఫస్ట్ హాఫ్ లో ఉండడు అంటుంటే ఆందోళన కలుగుతుంది. మిగతా ఆడియన్స్ భరిస్తారు. డై హార్డ్ ఫ్యాన్స్ స్క్రీన్ పై ప్రభాస్ కనిపించకుండా అంత సేపు సినిమా చూడటం అయ్యే పనేనా. క్రేజీ ఫ్యాన్స్ థియేటర్స్ లో కుర్చీలు విరగొట్టే ప్రమాదం లేకపోలేదు. స్టార్ హీరోల ఫ్యాన్స్ పల్స్ తెలిసి కూడా ప్రశాంత్ నీల్ ఇలా ఎందుకు స్క్రీన్ ప్లే రాసుకున్నాడని కొందరు వాపోతున్నారు.
అయితే దీనిపై స్పష్టమైన సమాచారం లేదు. ఒక ఊహాగానం మాత్రమే. ప్రభాస్ ఎంట్రీ లేటుగా ఉంటుంది అనేది నిజం. సినిమా మొదలయ్యాక ఎన్ని నిమిషాలకు ఎంట్రీ ఇస్తారు అనేది చూడాలి. సలార్ డిసెంబర్ 22న విడుదల కానుంది. ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. జగపతి బాబు, బాబీ సింహ కీలక రోల్స్ చేస్తున్నారు. ఇది ఇద్దరు మిత్రుల కథ. ప్రభాస్-పృథ్విరాజ్ ప్రాణమిత్రులు గా నటిస్తున్నారు.