https://oktelugu.com/

Bachchalamalli : ‘బచ్చలమల్లి’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..5 కోట్లు పెడితే వచ్చిన కలెక్షన్స్ ఇంతేనా..? పాపం అల్లరి నరేష్!

కామెడీ హీరో గా తెలుగు ప్రేక్షకుల్లో ఒక బ్రాండ్ ఇమేజ్ ని సంపాదించుకున్న వారిలో ఒకడు అల్లరి నరేష్. ఈయన సినిమాలకు ఒకప్పుడు ఉన్న క్రేజ్ మామూలుది కాదు.

Written By:
  • Vicky
  • , Updated On : December 21, 2024 / 09:32 AM IST

    Bachchalamalli

    Follow us on

    Bachchalamalli : కామెడీ హీరో గా తెలుగు ప్రేక్షకుల్లో ఒక బ్రాండ్ ఇమేజ్ ని సంపాదించుకున్న వారిలో ఒకడు అల్లరి నరేష్. ఈయన సినిమాలకు ఒకప్పుడు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. కానీ ఒకప్పుడు ఆయన కామెడీ ని తెగ ఎంజాయ్ చేసిన ఆడియన్స్, అదే తరహా సినిమాలు చేస్తుండడంతో ఆయన సినిమాలను చూడడం నెమ్మదిగా తగ్గించేశారు. ఆడియన్స్ మైండ్ సెట్ ని అర్థం చేసుకున్న అల్లరి నరేష్ అప్పటి నుండి తన పంథా మార్చుకొని కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న కంటెంట్ సినిమాలను మాత్రమే చేస్తూ వచ్చాడు. కామెడీ హీరో అనే ఇమేజ్ అయితే మారింది కానీ, ఆయన వెళ్తున్న ఈ కొత్త దారిలో సక్సెస్ లు మాత్రం రావడం లేదు. అయినప్పటికీ తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రయత్నం లో భాగమే నిన్న విడుదలైన ‘బచ్చలమల్లి’ చిత్రం. గ్రామీణ నేపథ్యం లో వచ్చిన ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది.

    ఇది ఇలా ఉండగా టీజర్, థియేట్రికల్ ట్రైలర్ వంటివి చూసి, గ్రామీణ నేపథ్యం లో తెరకెక్కిన బోల్డ్ చిత్రం లాగా ఉంది, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ లో ఈ చిత్రం సక్సెస్ అవుతుంది అనే ఉద్దేశ్యంతో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 కోట్ల రూపాయిలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్ ని బయ్యర్స్ కొనుగోలు చేసారు. నిన్న విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా వచ్చిన ఓపెనింగ్ వసూళ్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈమధ్య కాలం లో హైప్ లేకపోతే పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ సినిమాలకు కూడా ఆడియన్స్ కదలడం లేదు. ఓటీటీ ప్రభావం ఆ రేంజ్ లో ఉంది. మరి అల్లరి నరేష్ సినిమాకి హైప్ లేకపోతే ఎలాంటి ఓపెనింగ్ ఉంటుందో మనం ఊహించగలం. ఆ ఊహలకు తగ్గట్టుగానే ఈ సినిమాకి మొదటి రోజు వసూళ్లు వచ్చాయి.

    ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి అన్ని ప్రాంతాలకు కలిపి వరల్డ్ వైడ్ గా కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. అందులో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు కలిపి 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా నాలుగు కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టాలి. ఒక్క నైజాం ప్రాంతం లోనే రెండు కోట్ల 50 లక్షలు రావాలి. కానీ మొదటి రోజు వసూళ్లు చూస్తుంటే అంత రేంజ్ వసూళ్లు వస్తాయా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఎందుకంటే జనాలు ఇంకా ‘పుష్ప 2 ‘ మానియాలోనే ఉన్నారు. వీకెండ్ దొరికితే చాలు, ఆ చిత్రానికి కుటుంబాలతో కలిసి క్యూలు కట్టేస్తున్నారు. ఇలాంటి సమయంలో ‘బచ్చల మల్లి’ ఆడియన్స్ కి ఒక ఛాన్స్ గా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.