Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కొన్ని జెనరేషన్స్ కి ఒక రోల్ మోడల్. ఆయన డాన్స్ లకు ఆయన నటనకు ఫిదా కానీ వాళ్ళు ఎవరూ లేరనే చెప్పాలి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న జనాభా లో ఎక్కువ శాతం మంది చిరంజీవి ఫ్యాన్స్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక విత్తనంగా మొదలెట్టి ఇప్పుడు మహావృక్షంగా ఎదిగిన చిరంజీవి ఎందరికో ఆదర్శం అని చెప్పాలి. ఇక తాజాగా చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బేబీ సినిమా సక్సెస్ మీట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ హాజరయ్యాడు.
ఈ ఫంక్షన్ బేబీ సక్సెస్ మీట్ అనే కంటే చిరంజీవి సన్మాన సభ గా జరిగిందనే చెప్పాలి. వేదిక ఎక్కిన ప్రతీ ఒక్కరూ ‘నేను చిరంజీవి అభిమాని.. నాకు చిరంజీవి స్ఫూర్తి’ అంటూ పాఠం అందుకొన్నారు. సాయి రాజేష్, వైష్ణవి, ఆనంద్, మారుతి, ఎస్‌కేఎన్.. ఇలా ప్రతీ ఒక్కరూ చిరుని పొగడ్డమే కార్యక్రమంలా పెట్టుకొన్నారు. నిజానికి వీళ్లంతా చిరు ఫ్యాన్స్. తమ ముందు తమకిష్టమైన హీరో కనిపించే సరికి.. తమ అభిమానాన్నంతా చాటుకొనే ప్రయత్నం చేశారు.
చివరికి అది ఎలా తయారయింది అంటే చిరంజీవి కూడా ఇది బేబీ సినిమా సక్సెస్ మీట్ గా లేదు. నా సన్మాన సభ గా ఉందని అనే విధంగా మారిపోయింది. తమ అభిమాన హీరో కళ్ల ముందు కనిపించే సరికి అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి మీద పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ” నేను పుత్రోత్సహం ఎంత పొందుతున్నానో, ఇండస్ట్రీలో నా అభిమానుల ఎదుగుదల చూసి అంతే గర్వపడుతున్న, ఈ రోజునా నా అభిమానాలు చేసిన ఒక ప్రయత్నం ఇంత పెద్ద విజయాన్ని అందుకున్నందుకు, ప్రజామోదం పొందినందుకు చాలా సంతోషంగా ఉంది.
సాయి రాజేష్ హాస్య చిత్రాలు తీయడమే కాదు, జాతీయ అవార్డు దక్కించుకునే చిత్రాలకు కథను అందించగలను అని “కలర్ ఫోటో” సినిమాతో నిరూపించాడు. బేబీ లోని సమకాలీన కధ, అందులోని దర్శక విలువలు ద్వారా రాజేష్ ఇచ్చిన సందేశం మామూలుది కాదు. ఆనంద్ ఈ సినిమాలో సహజంగా నటించారు. తన ప్రియురాలు గురించి నిజం తెలిసిన సమయంలో ఆనంద్ కనబరిచిన బావోద్వేగాలు చూసి ఇతనిలో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అని ఆశ్చర్యపోయాను.
వైష్ణవి మానసిక సంఘర్షణ ఈ సినిమాను నిలబెట్టింది. ఈ సినిమా ఫీలింగ్ నుండి రెండు మూడు రోజులు బయటకు రాలేక పోయాను అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్. అదే సమయంలో నా అభిమానులు మిగతా హీరోల ఫ్యాన్స్ తో గొడవ పడిన విషయాలు నాకు తెలుసు, అయితే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ స్థాపించి, వాళ్లలోని సామాజిక సేవా కోణాన్ని బయటకు తీసుకొచ్చిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు చిరంజీవి.