Baby Movie Collections: ‘బేబీ’ 3 రోజుల వసూళ్లు..పెట్టిన డబ్బులకు పదింతలు వసూళ్లు!

ఈసారి 'బేబీ' చిత్రం తో మరో ఉదారణ చూస్తున్నాము. ఈ చిత్రం లో నటించిన ప్రధాన తారాగణం ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య మరియు విరాజ్ అశ్విన్ కెరీర్లకు ఈ చిత్రం ఇచ్చిన బూస్ట్ మామూలుది కాదు. ముఖ్యంగా యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకొని సినిమాల్లో అడపాదప అవకాశాలను దక్కించుకుంటూ, ఇప్పుడు హీరోయిన్ కి ప్రాధాన్యత ఉన్న పాత్ర ని పోషించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునే రేంజ్ హిట్ ని అందుకుంది.

Written By: Vicky, Updated On : July 17, 2023 8:02 am

Baby Movie Collections

Follow us on

Baby Movie Collections: రీసెంట్ సమయం లో చిన్న సినిమా అయ్యినప్పటికీ కూడా యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ రప్పించుకున్న చిత్రాలలో ఒకటి ‘బేబీ’. విడుదలకు ముందు పాటలు మరియు టీజర్ తో అంచనాలు అమాంతం పెంచేసిన ఈ సినిమా, విడుదల తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుంది. యూత్ కి కనెక్ట్ అయ్యేటట్టు ఒక సినిమా తీస్తే ఎలాంటి వసూళ్లు వస్తాయో అని చెప్పడానికి గతం లో ఎన్నో ఉదాహరణలు మనం చూసాము.

ఈసారి ‘బేబీ’ చిత్రం తో మరో ఉదారణ చూస్తున్నాము. ఈ చిత్రం లో నటించిన ప్రధాన తారాగణం ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య మరియు విరాజ్ అశ్విన్ కెరీర్లకు ఈ చిత్రం ఇచ్చిన బూస్ట్ మామూలుది కాదు. ముఖ్యంగా యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకొని సినిమాల్లో అడపాదప అవకాశాలను దక్కించుకుంటూ, ఇప్పుడు హీరోయిన్ కి ప్రాధాన్యత ఉన్న పాత్ర ని పోషించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునే రేంజ్ హిట్ ని అందుకుంది.

ఈ చిత్రం విడుదలై నేటికీ మూడు రోజులు పూర్తి అయ్యింది, ఈ మూడు రోజులకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము. మొదటి రోజు ప్రీమియర్స్ షోస్ లో వచ్చిన కలెక్షన్స్ తో కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కి 2 కోట్ల 62 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇదే బంపర్ కలెక్షన్స్ అని ట్రేడ్ అనుకుంటూ ఉంటే రెండవ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ చిత్రం. రెండవ రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 98 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట.

ఇక మూడవ రోజు రెండవ రోజు కంటే అద్భుతమైన ట్రెండ్ ని చూపించింది. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ చిత్రానికి మూడవ రోజు దాదాపుగా 3 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలా మూడు రోజులకు కలిపి తెలుగు స్టేట్స్ లో 8 కోట్ల 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగ , ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 11 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. రాబొయ్యే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎంత రేంజ్ కి వెళ్తుందో చూడాలి.