Babu Mohan Viral Video: తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాబు మోహన్ (Babu Mohan) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అందగాడిగా తనకంటూ ఒక కామెడీ గుర్తింపు నైతే సంపాదించుకున్నాడు. అయితే ఆయన ఇండస్ట్రీకి రావడానికి గల ముఖ్య కారణం ఎవరు అతనికి ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఎవరు అంటూ గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో అతన్ని అడగగా…కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) గారి పేరు చెప్పాడు. ఎందుకంటే ఏదో దారిలో పోతున్న వ్యక్తిని ఆయన చూసి నా సినిమాలో క్యారెక్టర్ కి నువ్వు సెట్ అవుతావని చెప్పి అతన్ని సినిమాల్లోకి తీసుకువచ్చి అంకుశం (Amkusham) సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వడం వల్లే తన కెరీర్ అనేది మారిపోయిందని చెప్పాడు. ఇక అంకుశం సినిమా రిలీజ్ అయిన తర్వాత అతనికి ఇమ్మీడియట్ గా పది సినిమాలు బుక్ అయ్యాయని దాసరి నారాయణ రావు (Dasari Narayana Rao) గారు కూడా మొదటి నుంచి తనకు పరిచయమని ఆయన వల్ల కూడా తను ఇండస్ట్రీలో కొద్దిరోజులపాటు మనుగడ సాగించానని చెప్పాడు.
Also Read:అల్లు అర్జున్ ఆ ఒక్క సినిమాతో చాలా వరకు వెనకబడ్డాడా..?
ఇక మొత్తానికైతే అంకుశం సినిమా తర్వాత అతనికి 10 సినిమాలు బుక్ అవ్వడంతో దాసరి నారాయణ గారి సినిమాకి సైతం డేట్స్ లేకుండా ఇవ్వలేకుండా అయిపోయాడట. దాంతో దాసరి గారి దగ్గరికి వెళ్లి నేను మీ సినిమాకు డేట్స్ ఇవ్వలేను అని చెప్పడంతో దాసరి గారు ఒక్కసారిగా షాక్ అయి నా సినిమాకు డేట్స్ ఇవ్వకపోవడం ఏంట్రా ఎవరికైనా కూడా డేట్స్ ఇవ్వను అని చెప్పకూడదు. డేట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి అనే ఒక మంచి మాటను అయితే చెప్పాడట.
దాంతో అప్పటినుంచి బాబు మోహన్ దాసరి నారాయణ గారు చెప్పిన మాటను ఫాలో అవుతూనే వస్తున్నాడట. అయితే సినిమాల్లో మాత్రం తనకు మొదటి అవకాశం ఇచ్చింది మాత్రం కోడి రామకృష్ణ గారు కాబట్టి అతనే తనకు ఇండస్ట్రీ లో గాడ్ ఫాదర్ అని చెబుతూ ఉంటాడు. మరి మొత్తానికైతే కోడి రామకృష్ణ గారు చేసిన చాలా సినిమాల్లో నటించిన నాకు మంచి గుర్తింపైతే వచ్చిందని ఆయన చాలా మంచి దర్శకుడు అని మహానుభావుడు అంటూ అతని గురించి బాబు మోహన్ చాలా గొప్పగా చెబుతూ ఉండడం విశేషం…
Also Read: పవన్ కళ్యాణ్ కే ఎసరు పెడుతున్న ఎన్టీఆర్…
ఇక ప్రస్తుతం బాబు మోహన్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నాడు. ఇంతకు ముందు సినిమాలను తగ్గించినప్పటికి ప్యారడైజ్ (Paradaise) సినిమాతో మరోసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాలో ఆయన పోషించిన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందట…ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించి తనకు మరిన్ని అవకాశాలను సంపాదించి పెడుతోంది అంటూ ఆయన చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు…