Babu Mohan latest news: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కోట శ్రీనివాసరావు లాంటి నటుడు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మెచ్చుకునేంత గొప్ప స్థాయికి ఎదిగిన విషయం మనకు తెలిసిందే… రీసెంట్ గా ఆయన ఈ లోఖాన్ని వదిలి వెళ్ళిపోయాడు. మరి ఇలాంటి సందర్భంలోనే అతనితోపాటు కలిసి ఎక్కువ సినిమాల్లో నటించిన బాబు మోహన్ కి అతనికి మధ్య చాలా మంచి బాండింగ్ అయితే ఉంది. వీళ్ళిద్దరు సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా అన్నదమ్ముళ్ళ కలిసిమెలిసి ఉంటారని చాలా సందర్భాల్లో తెలియజేశారు. మరి ఏది ఏమైనా కూడా బాబు మోహన్ కోట శ్రీనివాసరావుకు చాలా వాల్యూ ఇస్తూ వచ్చేవాడు…ఇక ప్రస్తుతం కోట శ్రీనివాసరావు ఉంటున్న ఇల్లు కి మొదట బాబు మోహన్ అడ్వాన్స్ అయితే ఇచ్చారట. రాజా బాబు తమ్ముడు అయిన చిట్టిబాబు ఫిలిం నగర్ లో ఉన్న తన ఇల్లు అమ్మి కూకట్ పల్లిలో వేరే ఇల్లు తీసుకుంటాను అని చెప్పాడట. అలాంటి సందర్భంలో ఆ ఇల్లు నువ్వు కొని అన్నా అని చిట్టిబాబు చెప్పడంతో బాబు మోహన్ అతనికి అడ్వాన్స్ అయితే ఇచ్చారట.
Also Read: అల్లు అర్జున్ ఆ ఒక్క సినిమాతో చాలా వరకు వెనకబడ్డాడా..?
ఆ తర్వాత ఒక రోజు షూటింగ్ కి వెళ్ళిన బాబు మోహన్ ఈ విషయాన్ని కోట శ్రీనివాసరావు కి చెబితే ఏరా నువ్వే కొంటావా మాకు ఇవ్వచ్చు కదా అని బాబు మోహన్ ను అడగడంతో ఆయన కోట శ్రీనివాసరావు గారికి ఆ ఇల్లు ఇచ్చేశారట. నిజంగానే ఇస్తున్నావా అని కోట గారు అడగడంతో నిజంగానే ఇస్తున్నాను అని చెప్పాడట.
చిట్టిబాబుతో మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చినట్టుగా నా పేరు తీసేసి కోటన్న పేరు రాసుకో అని చెప్పారట. మొత్తానికి కోటా శ్రీనివాసరావు ఆ ఇల్లును తీసుకొని అక్కడ తనకు నచ్చినట్టుగా ఒక మంచి ఇల్లు అయితే కట్టించుకున్నాడు. ఇక బాబు మోహన్ ఇచ్చిన అడ్వాన్స్ ని ఇప్పటివరకు కోట శ్రీనివాసరావు దగ్గర నుంచి తిరిగి తీసుకోలేదట. మరి ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి బాండింగ్ అయితే చాలా బాగుంటుంది.
Also Read: సినిమా ఇండస్ట్రీ లో బాబు మోహన్ గాడ్ ఫాదర్ అతనేనా..? వైరల్ వీడియో…
ప్రస్తుత కోట శ్రీనివాసరావు చనిపోయిన సందర్భంగా బాబు మోహన్ మాట్లాడిన కొన్ని మాటలు, వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి…మరి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు వాళ్ళిద్దరి నటనకు ఎనలేని గుర్తింపైతే ఉండేది…వాళ్ల కోసం స్టార్ హీరోలు సైతం వెయిట్ చేస్తూ ఉండేవారు…అప్పట్లో కాంబినేషన్ కి అంత మంచి గుర్తింపైతే ఉండేది…