Baahubali The Epic Re Release Collection: రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘బాహుబలి’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ప్రభాస్ రాజమౌళి ఇద్దరు పాన్ ఇండియాలో నెంబర్ వన్ స్థాయికి ఎదిగారు. ఇక ఈ సినిమా రెండు పార్టులను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో రీ రిలీజ్ చేశారు. రీసెంట్ గా రీ రిలీజ్ అయిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా మొదటి రోజే 10 కోట్ల వరకు కలెక్షన్స్ ని కొల్లగొట్టింది…ఇండియాలో దాదాపు 10 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఓవర్సీస్ లో 1 మిలియన్ డాలర్లను రాబట్టిన సినిమాగా ఘన చరిత్రను క్రియేట్ చేసింది. ఇప్పటివరకు రీ రిలీజ్ లో ఏ సినిమా కూడా మొదటి రోజు ఇంత భారీ వసూళ్లను రాబట్టలేదు.
Also Read: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లను చనిపోకుండా కాపాడిన రవితేజ…కారణం ఏంటంటే..?
కాబట్టి ఈ సినిమా ఒక అద్భుతమైన హిస్టరీని క్రియేట్ చేస్తుందనే చెప్పాలి… ఇవాళ్ళ, రేపు వీకెండ్స్ కావడంతో ఈ సినిమా మీద ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పటికే చాలా టికెట్స్ బుక్ అవుతున్నాయి. ఈ రెండు రోజుల్లో కూడా ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టే అవకాశాలైతే ఉన్నాయి.
మీడియం సినిమాకి ఏ రేంజ్ లో వసూలైతే వస్తాయో బాహుబలి రిలీజ్ కి ఆ రేంజ్ లో వసూళ్లు రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. సినిమా వచ్చి దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటి వరకు కూడా ఈ సినిమా మీద ఎలాంటి క్రేజ్ తగ్గలేదు… మూవీ వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఎవరు కూడా బోర్ ఫీల్ అవ్వకుండా సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు…
ఈ సినిమా రీ రిలీజ్ లో దుమ్మురేపుతోంది కాబట్టి లాంగ్ రన్ లో ఎంతటి వసూళ్లను రాబడుతోంది. రీ రిలీజ్ లన్నింటిని కలిపి ఈ మూవీ ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. హిందీలో కూడా ఈ సినిమాకి భారీ ఆదరణ దక్కుతోంది… చూడాలి మరి ఈ సినిమా రీ రిలీజ్ తో లెక్కలన్నీ సెట్ అవుతాయా లేదా అనేది…