Baahubali The Epic: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు దర్శకులు చాలామంది ఉన్నారు… దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న రాజమౌళి సైతం ఇప్పటివరకు చేసిన 12 సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. మరోసారి ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కోసం తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మూడు షెడ్యూల్స్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన ఆయన ఇకమీదట చేయబోతున్న షెడ్యూల్స్ ని సైతం సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈనెల 31వ తేదీన బాహుబలి రెండు పార్టులను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో రిలీజ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సందర్భంగా రాజమౌళి ప్రభాస్ రానాలతో కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఈ రెండు పార్టీలను కలిపి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కొన్ని సీన్లను అందులో నుంచి తొలగించినట్టుగా రాజమౌళి తెలియజేశాడు. అవి ఏంటంటే శివుడు అవంతిక లవ్ స్టోరీ, పచ్చబొట్టేసిన సాంగ్, మనోహరి సాంగ్, కన్నా నిదురించరా అనే సాంగ్ అలాగే యుద్ధానికి సంబంధించిన కొన్ని సీన్స్ ను సైతం ఈ సినిమాలో నుంచి డిలీట్ చేసినట్టుగా చెప్పాడు…అంత ఒకే కానీ యుద్ధ సన్నివేశాలు మొత్తం ఉంచితేనే బాగుండేది అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు… ఇక అలాగే రాజమౌళి మాట్లాడుతూ ప్రభాస్, రానా లను ఉద్దేశించి మీరు ఈ సినిమాకు ఎప్పుడు కనెక్ట్ అయ్యారు అని అడిగాడు.
దానికి రానా సమాధానం చెబుతూ ఎప్పుడైతే మీరు రాజ్యానికి సంబంధించిన మ్యాప్ మొత్తాన్ని నాకు చూపించారో అప్పటినుంచే నేను ఈ రాజ్యానికి అధిపతిని అని అనుకున్నాను. ఇక కిరీటం మీద చేయి వేసి ప్రమాణం చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ లో ఫుల్ గా ఇన్వాల్వ్ అయిపోయానని చెప్పాడు…
ప్రభాస్ కి మొదట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పటికి మూడో రోజు నుంచి షూటింగ్లో ఇన్వాల్వ్ అయిపోయాడట… అలాగే సేనాపతి తలనరికే సీన్, జడ్జిమెంట్ రూము సీన్స్ లో సైతం తను ఇన్వాల్వ్ అయిపోయానని చెప్పాడు. ఆ తర్వాత వచ్చే ‘దండాలయ్యా సాంగ్’ ఈ షూట్ అయిపోయిన మూడు సంవత్సరాల తర్వాత తీశారని చెప్పాడు.
ఇక అందులో భాగంగానే కర్నూల్ లో తను షూట్ చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చిన అభిమానులకు రాజమౌళి నాతో హాయ్ చెప్పించిన సంఘటనను నేను ఇప్పటికి మర్చిపోనని చెప్పాడు. మొత్తానికైతే ఈ సినిమా రీ రిలీజ్ లో ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన సినిమాలన్నింటిని వెనక్కి నెట్టి ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రీ రిలీజ్ సినిమాగా నిలుస్తోందా లేదా అనేది తెలియాల్సి ఉంది…
