Baahubali The Epic: దర్శక ధీరుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి…ప్రస్తుతం ఈయన మహేష్ బాబు తో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అక్టోబర్ 31వ తేదీన ‘బాహుబలి’ సినిమా రెండు పార్టులు కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమాని సెలెక్టెడ్ ఐమాక్స్ థియేటర్లలో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్కును దగ్గరుండి మరి చూసుకుంటున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఈ విషయాన్ని ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన శోభు యార్లగడ్డ ప్రస్తావిస్తూ రాజమౌళి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను గమనిస్తున్న ఒక ఫోటో తీసి ట్విట్టర్లో షేర్ చేశాడు. మొత్తానికైతే రాజమౌళి నుంచి వచ్చిన బాహుబలి సినిమా చాలామందికి ఆదర్శంగా నిలవడమే కాకుండా ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థాయిని పెంచింది. ఇక ప్రస్తుతం ఆయన బాటలోనే తెలుగు సినిమా దర్శకులు నడుస్తూ ఉండడం విశేషం…
ప్రస్తుతం పాన్ ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకోవడంలో రాజమౌళి మొదటి అడుగు వేస్తే అతన్ని ఫాలో అవుతూ మిగతా దర్శకులు మన ఇండస్ట్రిని టాప్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు… ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు బాహుబలి సినిమా రెండు పార్టులు కలిపి రిలీజ్ చేస్తున్నారు.
కాబట్టి ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేయాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాని చూడడానికి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరు ఆసక్తి ఎదురుచూస్తుండటం విశేషం… అలాగే రాజమౌళి సైతం ఈ సినిమాని రీరిలీజ్ చేయడానికి ఉత్సాహం చూపిస్తుండటం విశేషం…
ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న సినిమాకు సంబంధించిన ఒక భారీ షెడ్యూల్ ని తొందరలోనే స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. రాజమౌళి అటు ఆ పని చూసుకుంటూనే బాహుబలి సినిమా రీరిలీజ్ కి సంబంధించిన పనులను కూడా దగ్గరుండి చూసుకుంటుండటం విశేషం…
.@ssrajamouli giving finishing touches and final edit trims for @BaahubaliMovie “The Epic”! Editing has been one of the most challenging tasks of making this version! #BaahubaliTheEpic #BaahubaliTheEpicOnOct31st #Prabhas @RanaDaggubati @tamannaahspeaks @MsAnushkaShetty @ssk1122… pic.twitter.com/HH6C5trQSv
— Shobu Yarlagadda (@Shobu_) October 3, 2025