Auto Driver Sevalo Scheme: ఏపీలో( Andhra Pradesh) ఈరోజు మరో ప్రతిష్టాత్మక పథకం ప్రారంభం అయ్యింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ లాంచనంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో భాగంగా.. ఒక్కో ఆటో డ్రైవర్ ఖాతాలో 15 వేల రూపాయల చొప్పున నగదు జమ చేశారు. దాదాపు 3 లక్షల మంది ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరేలా ఈ పథకాన్ని రూపొందించారు. విజయవాడ వేదికగా పథకాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది ఆటో కార్మికుల మధ్య కార్యక్రమాలు కొనసాగాయి. కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బిజెపి అధ్యక్షుడు మాధవ్ తమ ఇళ్ల నుంచి.. విజయవాడ సింగ్ నగర్ లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియం వరకు ఆటోల్లో రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఉచిత ప్రయాణ పథకంతో..
ఏపీవ్యాప్తంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకంతో తాము నష్టపోతున్నామని బాధపడ్డారు ఆటో డ్రైవర్లు. వారి పరిస్థితిని గమనించిన సీఎం చంద్రబాబు.. దసరా కానుకగా ఆటో డ్రైవర్ల ఖాతాలో పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేస్తామని ప్రకటించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో పదివేల రూపాయల చొప్పున అందించగా.. దానికి 50 శాతం అదనంగా జోడించి డ్రైవర్ల ఖాతాలో జమ చేశారు. విజయవాడ వేదికగా ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఘనంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు. వేలాదిమంది ఆటో డ్రైవర్లు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉత్సాహభరిత వాతావరణంలో ఈ కార్యక్రమం సాగింది.
రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు..
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాన్ని జరిపించారు. వేలాది మంది ఆటో డ్రైవర్ల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. వాస్తవానికి ఎన్నికల్లో ఆటో డ్రైవర్ల సాయం పై ఎటువంటి హామీ లేదు. కానీ స్త్రీ శక్తి పథకం అమలు చేయడంతో ఆటో డ్రైవర్ల నుంచి డిమాండ్లు వచ్చాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే ఈ పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం అమలుతో ఆటో డ్రైవర్ల నుంచి సానుకూలత వ్యక్తం అవుతోంది. మరోవైపు విజయవాడలో స్వయంగా ఆటోల్లో ప్రయాణించి.. ఆటో డ్రైవర్లలో మరింత ఉత్సాహం నింపారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, మాధవ్ తదితరులు..
ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభించటం కోసం ఉండవల్లి చేరుకున్న సీఎం , డిప్యూటీ సీఎం , బీజేపీ ఏపీ అధ్యక్షులకు మంగళగిరి చేనేత కండువాలు కప్పి స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్.#AutoDriverlaSevalo#Super6SuperHit#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#NaraLokesh#AndhraPradesh pic.twitter.com/FRdSnmYIXr
— Telugu Desam Party (@JaiTDP) October 4, 2025
