Baahubali Horse Death Video: సినిమా ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ డైరెక్టర్లు వీలైనంత తొందరగా సినిమాలను ఫినిష్ చేసుకుంటూ కొత్త సినిమాను స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే మంచిది. ఇలా చేస్తే ప్రతి ఒక్కరికి పని దొరుకుతుందని సినిమా ఇండస్ట్రీలో ఉన్న సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కొంత మంది దర్శక నిర్మాతలు మాత్రం తొందరగా సినిమాలు చేస్తే సినిమా క్వాలిటీ బాగుండదని, వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ అందరికీ రీచ్ అయ్యే అవకాశం ఉండదేమో అనే ఒక ఫీలింగ్ తో ఉన్నారు. ఇక ఇలాంటి ఉద్దేశ్యంతోనే హైలీ గ్రాఫిక్స్ కి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు చేస్తున్నద్లు. ఒక గ్రాఫిక్స్ వర్క్ అంటే లేటవుతుంది అంటూ కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు… రాజమౌళి(Rajamouli) ఎప్పుడైతే బాహుబలి (Babubali) సినిమా చేశాడో అప్పటినుంచి సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో సినిమా చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే కొన్ని వందల వేల కోట్ల బడ్జెట్ ని సినిమాల మీద కేటాయిస్తున్నారు. హైలీ గ్రాఫిక్స్ తో విజువల్ వందర గా తెరకెక్కించడానికి ఒక సినిమాకి దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం అయితే తీసుకుంటున్నారు. అందువల్లే స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా రావడం లేదు అంటూ ప్రేక్షకులు సైతం కొంతవరకు నిరాశను వ్యక్తం చేస్తున్నారు, ఇక బాహుబలి సినిమా భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాలో రాజమౌళి భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ని తెరకెక్కించాడు.
ముఖ్యంగా ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో భారీ విన్యాసాలు చేయించడం అతని అభిమానులకు విపరీతంగా నచ్చింది. బాహుబలి 2 (Bahubali 2)సినిమాలో ప్రభాస్ క్లైమాక్స్ ఫైట్ లో రానా ని ఎదుర్కొంటున్నప్పుడు వాళ్లిద్దరి మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ లో ప్రభాస్ చాలా బలంగా కనబడతాడు. అది చూసిన ప్రేక్షకులు అతనికి అభిమానులుగా మారిపోయారు.
Also Read: Rajamouli : రాజమౌళి ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ, ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?
అయితే బాహుబలి 2 లో ప్రభాస్ కోటలోకి ఎంటర్ అవుతున్నప్పుడు కోట ద్వారా మూసేసే క్రమంలో ప్రభాస్ గుర్రం మీద నుంచి పైకి జంప్ చేస్తాడు కానీ ఆ గుర్రం మాత్రం అక్కడే ఆ గోడకు గుద్దుకొని కిందపడిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అది చూసిన నెటిజన్లు రాజమౌళి గుర్రం ఏం పాపం చేసిందని దాన్ని అనవసరంగా చంపేసావు. ప్రభాస్ గాల్లోకి ఎగురుతున్నప్పుడు గుర్రంతో పాటు ఎగిరితే అయిపోయేది కదా అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా ఆ గుర్రం చచ్చిపోవడం అనేది జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకమీదట రాజమౌళి సినిమాలు చేసినప్పుడు ఇలాంటివి జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుందని మరి కొంతమంది అతనికి సలహాలను ఇస్తున్నారు. మగధీర (Magadheera) సినిమాలో గుర్రాన్ని కాపాడడానికి రామ్ చరణ్ (Ram Charan) చిక్కుల్లో పడతాడు. మరి అలాంటి ఒక గుర్రం వాల్యూ తెలిసిన రాజమౌళి ఈ సినిమాలో మాత్రం గుర్రాన్ని సేవ్ చేయలేకపోవడం అతని అభిమానులను కొంతవరకు నిరాశ పరిచిందనే చెప్పాలి…