‘బాహుబలి’ సినిమాలకు నేషనల్ స్థాయిలో భారీ గుర్తింపు రావడంతో.. ఆ గుర్తింపును క్యాష్ చేసుకోవడానికి గత మూడేళ్లుగా బాహుబలి వెబ్ సిరీస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ, ఈ సిరీస్ కి మొదటి నుండి అనేక సమస్యలు చవి చూస్తూ వచ్చింది. నిజానికి కొంత భాగం షూట్ కూడా చేశారు. కానీ, నిర్మాతలకు అది నచ్చలేదు. దాంతో తీసిందంతా డిలీట్ చేసి పారేశారు.
నష్టమైనా సరే.. ఎలాగైనా మళ్ళీ కొత్తగా తీయాలని చాల ప్రయత్నాలు చేశారు. రెండు సార్లు షూట్ కూడా స్టార్ట్ చేశారు. కానీ ఏవి వర్కౌట్ అవ్వలేదు. అన్ని ప్రయత్నాలు బెడిసికొట్టాయి. తాజాగా ఇప్పుడు మూడోసారి ఈ సిరీస్ మొదలైంది. కాకపోతే మరో టీం ఈ వెబ్ సిరీస్ ని టేకప్ చేసిందని తెలుస్తోంది. అయితే ఈ సిరీస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న కొత్త టీం మెయిన్ లీడ్ కి ‘నయనతార’ని సంప్రదించారనే వార్త వైరల్ అవుతుంది.
అయినా ‘బాహుబలి’ సినిమానే చాలాసార్లు చూశారు. ఆ కథ కూడా ఇప్పుడు బాగా పాతది అయిపోయింది. మరి ఇలాంటి స్క్రిప్ట్ పై కొత్తగా వెబ్ సిరీస్ తీసేది ఏముంది అనేది ? నెటిజన్ల డౌట్. అసలు ఈ సిరీస్ దేని గురించి ఉంటుంది అంటే.. రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సిరీస్ కొనసాగుతుంది.
అసలు శివగామి రాజమాత ఎలా అయింది ? రాజు కంటే గొప్ప స్థాయికి ఆమె ఎలా ఎదిగింది ? అలాగే ఆమె బాహుబలిని చంపించడానికి ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ? లాంటి అంశాల చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. మొత్తానికి శివగామి యువతిగా ఉన్నప్పటి కథ నుండి చనిపోయే వరకు ఈ కథ ఉంటుంది. యువతిగా ఉన్న పాత్ర కోసం ‘వామికా’ అనే కొత్త బ్యూటీని తీసుకున్నారట. ఇక సీనియర్ శివగామి పాత్రకు నయనతారని తీసుకుంటున్నారు.