Ayesha Shiva: మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని విషయాలు తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు మహేష్ బాబు తన కెరియర్ లో చేసిన సూపర్ హిట్ సినిమాలలో బిజినెస్ మ్యాన్ సినిమాకు ప్రత్యేక క్రేజ్ ఉంది. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించి మహేష్ బాబు అభిమానులను ఉర్రూతలూగించింది. అప్పట్లో ఈ సినిమాలో మహేష్ బాబు లుక్స్ తో పాటు డైలాగ్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో డైలాగ్స్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కూడా ఈ డైలాగ్స్ ఎక్కడ ఒకచోట నిత్యం వినబడతాయి. ఇప్పటికి బిజినెస్ మ్యాన్ సినిమా టీవీలో ప్రసారమైతే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తారు. 2012లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయం అందుకుంది. ఇక ఈ సినిమాకు ముందు పూరి జగన్నాథ్, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన సినిమా పోకిరి ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తర్వాత సినిమా బిజినెస్ మ్యాన్ కూడా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే సూపర్ హిట్ విజయం సాధించింది. ఈ సినిమాలో మహేష్ బాబు మాఫియా డాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. సూర్య భాయ్ పాత్రలో మహేష్ బాబు నటన అందరిని ఆకట్టుకుంది.
మహేష్ బాబు కి జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు సంగీత దర్శకుడు తమన్ అందించిన మ్యూజిక్ హైలెట్ అని చెప్పొచ్చు. ఇది ఎలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ కు ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. కాజల్ స్నేహితురాలికి, హీరో మహేష్ బాబు కి మధ్య ఉండే కొన్ని సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఈ సినిమా తర్వాత ఆమె మరొక సినిమాలో కనిపించలేదు. ఆమె పేరు అయేషా శివ. బిజినెస్ మ్యాన్ సినిమాతో ఆయేషా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.
ఆ తర్వాత ఈమె స్టార్ గేట్ అట్లానిస్, కాప్రికా వండి టీవీ సిరీస్ లలో నటించడం జరిగింది. నటిగానే కాకుండా ఆమె నిర్మాతగా కూడా చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న ఆయేషా సినిమాలకు దూరంగా ఉంటుంది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకునే పనిలో ఉంటుంది. తాజాగా అయేషా షేర్ చేసిన ఫొటోస్ సామాజిక మాధ్యమాల్లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
View this post on Instagram